నేటితో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి దాంతో ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం బయటికి వస్తున్నాయి వీటి ప్రకారం కేంద్రంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకుని ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

న్యూస్‌18 తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కాంగ్రెస్ 5- 8 సీట్లు గెలుచుకోనుండగా.. బీఆర్ఎస్ 2-5.. బీజేపీ 7-10 సీట్లు, ఎంఐఎం 0-1 సీట్లు, అదర్స్ 0కే పరిమితం కానున్నాయి.

దైనిక్ భాస్కర్ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ సర్వే చూస్తే ఎన్డీయే: 281-350, ఇండియా కూటమి: 145-201 గెలుచుకోనుంది. ఇతరులకు 33-49 సీట్లు రానున్నాయి.

ఏబీపీ - సీ - ఓటర్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ చూస్తే... టీడీపీ కూటమి: 21-25, వైసీపీ 0-4, ఇతరులు: 0 సీట్లు గెలుచుకోనున్నాయి.

న్యూస్-18 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ 19-22 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనుంది. వైసీపీకి 5-8 సీట్లు వస్తాయి. ఇతరులకు 0.

చాలా జాతీయ మీడియా సంస్థలు లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏ కూటమి 350 కి పైగానే లోకసభ సీట్లను గెలుచుకోబోతోందని తెలిపాయి. ఇండియా కూటమి 110-170 రేంజ్ లో గెలుచుకునే అవకాశం ఉందని తెలిపాయి ఈ ఫిగర్ అనేది కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోవు అని చెప్పుకోవచ్చు.

పయనీర్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. టీడీపీ కూటమి+ : 20కు పైగా సీట్లు గెలుచుకోవచ్చు. వైకాపా: 5 సీట్లకే పరిమితం కానుంది.

ఇండియా న్యూస్ -డీ- డైనమిక్స్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకుంటే టీడీపీ కూటమి +: 18+ వైసీపీ: 7, ఇతరులు: 0 రానున్నాయి.

సీఎన్ఎక్స్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే, టీడీపీ కూటమి: 13-15, వైసీపీ: 3-5, జనసేన: 2 బీజేపీ : 4-6 విన్ కానున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయో జూన్ 4వ తేదీన తెలిసిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: