ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలక నేతలు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , జగన్మోహన్ రెడ్డి. కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన విడుదల కానుంది. ఈ సారి ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వై సీ పీ ఒంటరిగా బరిలోకి దిగగా , తెలుగు దేశం , జనసేన , భారతీయ జనతా పార్టీ మూడు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి.

ఇకపోతే ప్రస్తుతం ఆంధ్ర ప్రజలు ఒంటరిగా పోటీలోకి దిగిన వై సి పి పార్టీ ఎక్కువ సీట్ లను దక్కించుకొని మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందా ..? లేక కూటమి ఈ సారి ఎక్కువ స్థానాలను దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతల అయినటువంటి చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురిలో ఎవరి రిజల్ట్ ముందుగా రాబోతుంది అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ సారి "పిఠాపురం" నుండి పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నియోజక వర్గం యొక్క ఫలితం మధ్యాహ్నం వరకే రాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు , వై సి పి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన సాయంత్రం పూట వరకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ ముగ్గురు ప్రధాన నాయకులలో అందరి కంటే ముందు పవన్ కళ్యాణ్ రిజల్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాతే చంద్రబాబు నాయుడు , జగన్మోహన్ రెడ్డి ఫలితాలు విడుదల కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap