సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏ ఉంటుంది. దీనిపై అటెస్టింగ్ ఆఫీసర్ సైన్ ఉండాలని, ఆయన పొజిషన్, డీటైల్స్ పేర్కొనాలి అని ఒక రూల్ ఉంటుంది. ఆ ఫాం-13ఏపై ఈ డీటైల్స్ అన్నీ ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ ఓటు వ్యాలీడ్ అవుతుందని అంటారు. అయితే ఇవేమి ఇకపై అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఎవరి సైన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను వైసీపీ పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇలా ఈసీ పై జగన్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కి కొద్ది రోజులు గడిచిపోయింది.
అయితే తాజాగా వైసీపీ దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను హైకోర్టు సింపుల్‌గా కొట్టేసింది. అంతేకాదు, పోస్టల్ బ్యాలెట్‌పై సీలు లేకపోయినా దానిని కౌంట్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సీలు గురించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది. అలానే వైసీపీ పిటిషన్‌ను కొట్టేయడంతో వైసీపీకి ఝలక్ తగిలినట్టు అయింది.
ఇకపోతే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో వైసీపీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా, మరికొన్ని టీడీపీ 161 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పాయి. జూన్ 4న ఎవరు గెలుస్తారని నిజంగా తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది చాలామంది కామెంట్లు చేస్తున్నారు.