పిఠాపురం.. ఇక్కడ పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్. అంతేకాదు జనసేన అధినేత. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని చావో రేవో అన్నట్టుగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆ విధంగానే పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. దీనికి తోడు టిడిపి, బిజెపితో పొత్తు ఆయనకు మరో కలిసి వచ్చే అంశం.ఎన్నికల కౌంటింగ్ కు ముందే కోనసీమ , కాకి నాడ జిల్లాల్లో స్టిక్కర్ల వార్ షురూ అయ్యింది. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతుదారులు తమ బైక్స్ వెనుక స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లపై, వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తున్నారు. అటు, వైసీపీ శ్రేణులు, వంగా గీత అభిమానులు సైతం 'డిప్యూటీ సీఎం గారి తాలూకా' అంటూ స్టిక్కర్లు పెడుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే ఆమెను డిప్యూటీ సీఎంను చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో 'డిప్యూటీ సీఎం గారి తాలూకా' అంటూ బైక్స్, మొబైల్స్ పై స్టిక్కర్లు హల్ చల్ చేస్తున్నాయి. అటు, సోషల్ మీడియాలో ఈ స్టిక్కర్లు వైరల్ గా మారాయి.మరోవైపు, ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్, చంద్రబాబు మెజార్టీపైనా బెట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. అటు, పిఠాపురంలోనూ గెలుపోటములు, మెజార్టీపైనా ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది. కాగా, స్టిక్కర్ల వార్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫలితం తేలకముందే ఇలా ఎవరికి వారు పోస్టులు పెట్టడం సరికాదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరిది గెలుపు అనేది తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.పిఠాపురం లో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం mla తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు.పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 4న ఫలితాలు వస్తుండటంతో పోలీసుల హై అలర్ట్  అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: