ప్రజలందరూ ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్.. నిన్నటి రోజున సర్వే సంస్థలన్నీ తెలియజేసాయి. ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు చెప్పడం కూడా జరిగింది. కొన్ని సర్వేలు కూటమికి మరికొన్ని వైసీపీ పార్టీ గెలుస్తుంది అనే విధంగా తెలియజేశాయి..తాజాగా సిపిఎస్ సర్వే.. వచ్చేటప్పటికి తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీకి కూటమి తరపు నుంచి 46% ఓటింగ్ ఉందని.. కాంగ్రెస్కు 2.4 శాతం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.5 % ఉంటుందని తెలియజేస్తున్నారు. మొత్తం మీద వైయస్సార్ పార్టీ ఈసారి అధికారాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ తమ అంచనాగా నిన్నటి రోజున తెలియజేశారు సిపిఎస్ సర్వే.



ఇందులో సీట్ల పరంగా చూసుకుంటే.. వైసీపీ పార్టీ 97 నుంచి 108 స్థానాలు దక్కించుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. టిడిపి జనసేన బిజెపి.. 66 నుంచి 78 స్థానాలు గెలుచుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. కాంగ్రెస్  ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉందంటూ తెలుపుతున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన 6 నుంచి 9 స్థానాలు సాధిస్తుందని.. బిజెపి 0 నుంచి 2 స్థానాలు గెలుచుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా అందరిని అయోమయంలో పడేసేలా చేశారు.


జూన్ 4వ తేదీన ఫలితాలు వెలుపడనున్నాయి. మరి ఆ రోజున అధికారం ఏ పార్టీది అనేది తెలియబోతుంది. ముఖ్యంగా ఈసారి చాలా టైట్ ఫైట్ గానే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందనే విధంగా చాలా మంది సర్వేలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా 100 సీట్లలోపే గెలిచే అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా  చాలామంది సీనియర్ నేతలు కూడా తెలియజేశారు.. మరి కొంతమంది సర్వేల ప్రకారం ఈసారి సీనియర్  మంత్రులు కూడా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే విధంగా పలు సర్వే సంస్థలు తెలియజేశాయి. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీన చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: