ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లేందుకు కుటుంబ స‌మేతంగా రెడీ అయ్యారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ఐప్యాక్ సంస్థ ప్ర‌తినిధులు, సిబ్బందిని క‌లిశారు. ఈ క్ర‌మంలో వారిని ఉద్దేశించి మాట్టాడిన ఆయ‌న‌.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ఫ‌లితం ఉంటుంద‌ని అన్నారు. అంతేకాదు.. అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా కూడా.. ఈ ఫలితాలు కూడా ఉంటాయ‌ని చెప్పారు. అంటే.. ఆయ‌న లెక్క ప్ర‌కారం.. ఎంపీస్థానాల్లో 25 కు 25 లేదా.. ఒక‌టి త‌గ్గినా.. 25 కు 24 ఖాయ‌మై ఉండాలి.


ఇక‌, అసెంబ్లీ స్థానాల్లో 175కు 175 రావాలి. లేదా.. ఓ ప‌ది స్థానాలు త‌గ్గినా.. 175కు 165 స్థానాలైనా రావాల్సి ఉంది. ఇలా జ‌రిగి తేనే ఒక కంటిన్యూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లుఎన్ను కొన్న తీరును బ‌ట్టి.. దేశం మొత్తం ఆశ్చ‌ర్యంలో మునిగిపోతుంది. పైగా.. జ‌గ‌న్‌ను పాల‌న చేత‌కాని వాడు.. సైకో.. దుర్మార్గుడు అంటూ ప్ర‌తిప‌క్షాలు తిట్టిపోసినా.. ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నార‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యం తో ఏపీవైపు చూస్తారు. ఇదే ఉద్దేశంతో సీఎం జ‌గ‌న్ ఆ వ్యాఖ్య‌లు చేసి ఉంటారు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతాయో తెలియ‌దు.


కానీ.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇదే నిజ‌మైతే.. అప్పుడు వాస్త‌వంగానే అంద‌రూ ఆశ్చ‌ర్యపోతారు. అంద‌రూ ఆశ్చ‌ర్య‌మే కాదు.. బుగ్గ‌లు కూడా నొక్కుకుంటారు. ఎందుకంటే.. ఇప్పుడు వ‌చ్చిన ఏ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలోనూ .. వైసీపీకి ఇప్పుడున్న 22 సీట్లు కూడా ద‌క్కుతాయ‌ని చెప్ప‌లేదు. అంతేకాదు.. జాతీయ సంస్థ‌లైతే.. అంతా కూట‌మికి ప‌ట్టం క‌ట్టాయి. కూట‌మికి 21-25 సీట్లు ఖాయ‌మ‌ని ఏబీపీ సీ ఓట‌ర్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క స‌ర్వే చెప్పేసింది. ఇక్క‌డ వైసీపీకి అస‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా లేద‌ని .. వ‌చ్చినా నాలుగులోపేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.


ఇక‌, ఇండియా టుడే.. వంటి ప్ర‌తిష్టాత్మ‌క స‌ర్వే కూడా.. కూట‌మికి 21-23 పార్ల‌మెంటు స్థానాలు ద‌క్కుతాయ‌ని చెప్ప‌డం మ‌రో సంచ‌ల‌నం. ఇక్క‌డ వైసీపీకి 2-4 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ఈ సంస్థ వెల్ల‌డించింది. ఇక‌, ఇండియా టీవీ సీ ఎన్ ఎక్స్ సంయుక్త స‌ర్వేలోనూ.. కూట‌మికి 19-23 సీట్లు వ‌స్తాయ‌ని తేల్చి చెప్పింది. వైసీప‌కి కేవ‌లం 3- 5 స్థానాల‌లోపే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పింది. ఇక‌, టుడేస్ చాణక్య అనే మ‌రో విశ్వ‌స‌నీయ స‌ర్వే కూడా.. కూట‌మికి ప‌ట్టం క‌ట్టింది. ఈ కూట‌మికి 22 సీట్లుప‌క్కా అని తేల్చి చెప్పింది. వైసీపీకి కేవలం 3 స్థానాలే వ‌స్తాయ‌ని పేర్కొంది. నిజానికి ఇవ‌న్నీ అంచ‌నాలే . కానీ, రేపు నిజ‌మే అయితే.. ప్ర‌జ‌లు ఇలానే తీర్పు ఇచ్చి ఉంటే.. ఖ‌చ్చితంగా రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు.. దేశంమొత్తం ఆశ్చ‌ర్యం కాదు.. నిభిడాశ్చ‌ర్యంలో మునిగిపోవ‌డం ఖాయం. ఎందుకంటే.. 22 స్థానాల నుంచి 2-3-4-5 స్థానాల‌కు ప‌డిపోవ‌డం అంటే.. ఆశ్చ‌ర్య‌మే క‌దా!!

మరింత సమాచారం తెలుసుకోండి: