ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెట్‌ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు శనివారం రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెట్‌ ఎన్నికల ఎగ్జిట్‌ ఫలితాలు వైసీపీ అనుకూలంగా కొన్ని రాగా, మరికొన్ని టీడీపీ కూటమికి వచ్చాయి. ఓవరాల్‌ గా చూసుకున్నట్లయితే... వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు మెజారిటీ సంస్థలు ప్రకటించాయి. ముఖ్యంగా ఆరా మస్తాన్‌ సంస్థ..కూడా వైసీపీకి అధికారం ఖాయమని పేర్కొంది. దీంతో ఆరా మస్తాన్‌ సంస్థపై టీడీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.


తాజాగా టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జి బుద్ధా వెంకన్న కూడా ఆరా మస్తాన్ సర్వే ఫేక్ సర్వే అంటూ మండిపడ్డారు. అధికారులు అంతర్గతంగా మేనేజ్ చేయాలి అనే సంకేతం ఇచ్చేలా ఆరా మస్తాన్ సర్వే ఉందని ఆగ్రహించారు బుద్ధా వెంకన్న. బెట్టింగ్ లు అన్నీ టిడిపి వైపు కాయడానికి, వైసీపీ బెట్టింగ్ లన్నీ వాళ్ళే కాస్తారన్నారు. ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి బెట్టింగ్ రూపంలో ఆరా మస్తాన్ తో ఆడిస్తున్న మైండ్ గేమ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.


ఎవరూ ఆరా మస్తాన్ సర్వే నమ్మొద్దని కోరారు బుద్ధా వెంకన్న. నేషనల్ ఛానెల్స్ అన్నీ కూటమి బలాన్ని చెపితే... ఆరా మస్తాన్ తో ఫేక్ సర్వే చెప్పించారని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటానని సవాల్‌ విసిరారు.  వైసీపీ గెలవకపోతే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా అని ఛాలెంజ్‌ చేశారు బుద్ధా వెంకన్న.


ఆరా మస్తాన్ తో చెప్పించినట్లుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే, జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబుకు..జగన్ ఛాలెంజ్ చేయగలడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జి బుద్ధా వెంకన్న. టిడిపి కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికే ఆరా మస్తాన్ సర్వే ఇలా రిపోర్టు ఇచ్చిందన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు.... కూటమి అధికారంలోకి వచ్చాక ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పి, ఫేక్ సర్వే చెప్పించిన వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: