నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 350కు పైనే ఎంపీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. 400కు పైన కూడా రావచ్చని ఇండియా టీవీ - సీఎన్‌ఎక్స్‌; టుడేస్‌ చాణక్య; ఇండియా టుడే - యాక్సిస్‌ మై ఇండియా సంస్థలు అంచనా వేసాయి. బీజేపీ మొదటిసారిగా కేరళలో ఖాతా తెరవచ్చని చెప్పాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో బీజేపీ మరింత కొంచెం ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని వెల్లడించాయి. అయితే ఇలా సర్వేలన్నీ కూడా ఎన్డీయేనే గెలుస్తుందని చెప్పడంతో మోదీ ఒక చిన్న ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి చేసిందని, భారతదేశ ప్రజలందరూ తమ పాలనతో సంతృప్తి చెంది ఓట్లు వేశారని అన్నారు.

మరోవైపు ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని, ఒక్కటి కూడా తగ్గదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. శనివారంతో ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతూ ఈ నేతలు ఆ కామెంట్లు చేశారు. ఇండియా కూటమి 200 మార్కు దాటే ఛాన్సే లేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుస్తోంది. అన్ని పోల్స్ కూడా ఇండియా కూటమి 200 సీట్లు క్రాస్ చేయలేదని తెలిపాయి. ఇండియా న్యూస్‌ - డి డైనమిక్స్‌, జన్‌ కీ బాత్‌, రిపబ్లిక్‌ భారత్‌ - మ్యాట్రిజ్‌; రిపబ్లిక్‌ టీవీ- పి మార్క్‌; టుడేస్‌ చాణక్య తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం ఈసారి ఎన్డీయే కచ్చితంగా 350 సీట్లతో అధికారంలోకి రానుంది.

ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా జట్టు కట్టినా మోదీని ఎదుర్కోలేకపోవడం గమనార్హం. కుల గణన, రిజర్వేషన్ల అంశాలను కాంగ్రెస్ బాగా హైలైట్ చేసింది కానీ అవి ఏమీ నమ్మకుండా ప్రజలు మోదీకే ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. జూన్ 4వ తేదీన అసలు ఈ ఎగ్జిట్ పోల్ చెప్పినది నిజమా కాదా అని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడే మోదీ గెలిచినట్లే అని చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: