ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో "నా ఎస్టీ.. నా ఎస్సీ.. నా బీసీ" అంటూ ఒక డైలాగ్ బాగా వినిపించారు. వారందరూ వైసీపీ పార్టీని మరోసారి తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అనుకుంటే సరిపోదు కదా, వారు వెన్నుపోటు పొడవచ్చు కదా అనే అనుమానాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఏపీలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినది ఎవరైనా ఉన్నారా అంటే సీనియర్ ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. ఆయనకంటే ముందు అగ్రకులాల వ్యక్తుల మధ్య రాజకీయం నలిగింది. అయితే తారకరామారావు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారి మద్దతుతోనే 1983 కాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం పదవిని అధిరోహించారు.

అందుకే టీడీపీకి బీసీల పార్టీ అనే పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది జగన్ అని చెప్పుకోవచ్చు ఆయన అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రతి చోటా కూడా బీసీలకు పట్టం కట్టారు. ప్రతి చోటా బీసీ నేతలకు ప్రజలకు మంచి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీరు లేకుండా ఏ కమిటీ ఏర్పాటు కాలేదంటే అతిశయోక్తి కాదు. ఏ కులాల వాళ్లకు పదవులు రాలేదో వాళ్ల లిస్టు తయారు చేసే వారందరికీ కూడా పదవులను కట్టబెట్టారు.

అయితే ఎన్టీ రామారావు బీసీలను అక్కున చేర్చుకొని సక్సెస్ అయ్యారు, చిరంజీవి కూడా అదే రూట్ లో వెళ్లారు కానీ ఫెయిలయ్యారు. ఆయన వాళ్లకే 100 సీట్లు ఇచ్చినా గెలవలేకపోయారు. ఏపీ సీఎం జగన్ కూడా అసెంబ్లీ, ఎంపీ సీట్లు ఎక్కువ బీసీలకే అందజేశారు. రెడ్డి, ఓసి అభ్యర్థులను మంత్రి పదవిలో నుంచి తొలగించారేమో కానీ బీసీ వారిని మాత్రం అలాగే ఉంచారు. టీడీపీకి కంచుకోట ఆయన బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టానని జగన్ అనుకుంటున్నారేమో కానీ ఆయన అంచనా రివర్స్ కావచ్చు. కొంతమేర మాత్రమే బీసీ ఓట్లు వైసీపీకి పడి ఉండవచ్చు. ఈ సామాజిక వర్గ ప్రజలు వెన్నుపోటు పొడిచినా పొడి చేస్తారు అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: