దేశవ్యాప్తంగా సర్వే సంస్థలు ముందస్తు ఫలితాలని ప్రకటించాయి. దీనిలో భాగంగా తెలంగాణ ఎంపీ స్థానాల విషయాన్ని కూడా తేల్చి చెప్పాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గత 2019లో జరిగిన ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 9 స్థానాలు దక్కించుకుని జయకేతనం ఎగరవేసింది. ఇదే పార్లమెంటుకి ఆయువుపట్టుగా మారింది. అందుకే బీఆర్ఎస్‌ అధినేత కెసిఆర్.. దేశంలోనే చక్రం తిప్పుతున్నానని బయలు దేరారు. అప్పటివరకు టిఆర్ఎస్ పార్టీగా ఉన్న దానిని బిఆర్ఎస్ గా మార్చారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా కలుసుకున్నారు.

కానీ మద్యం కుంభకోణం తెరమీదకి రావడం.. రాష్ట్రంలో బిజెపి మరియు కాంగ్రెస్ లు పుంజుకునే అవకాశం కనిపించడంతో.. ఆయన రాజి పడ్డారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలలో పరాభావం ఎదురయింది. గెలిచిన నాయకులను కూడా.. నిలబెట్టుకోలేక పోయినా పరిస్థితి కళ్ళముందు కనిపించింది. అయితే పార్లమెంటు ఎన్నికలలో ఆయన పట్టు బిగించి.. కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనాలని కొన్నాళ్లుగా కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఇది ఏమిరకు సక్సెస్ అయ్యింది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత.. టిఆర్ఎస్ పుంజుకునే ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయి? అనేది ఆసక్తిగా మారింది.

ఈ విషయం తాజాగా వెలుగు చూసిన ముందస్తు ఫలితాల్లో దాదాపు తేలిపోయింది. అప్రతిహతంగా పదేళ్ల సాగిన బిఆర్ఎస్ హవాకు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బ్రేకులు వేసినట్టు ఎగ్జిట్ పోల్ సర్వేలు చాటి చెప్పాయి. ఎగ్జిట్ పోల్ వెల్లడించిన సర్వే సంస్థల్లో ఆరా మస్తాన్ సహా.. ఐదు సంస్థలు.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా టిఆర్ఎస్ దక్కించుకోదని తేల్చి చెప్పడం గమనార్హం. ఇక ఇతర సంస్థలు చెప్పిన ఫలితాల్లోనూ టిఆర్ఎస్ కు 1 మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని చెప్పడం సంచలనం సృష్టించింది.

మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే మాత్రమే రెండు లేదా ఐదు స్థానాల్లో విజయం సాధించుకునే ఛాన్సెస్ ఉందని వెల్లడించింది. అంటే మొత్తానికి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో సగం కూడా వచ్చే పరిస్థితి బీఆర్ఎస్ కు లేకుండా పోయింది. ఇదే సమయంలో బిఆర్ఎస్ స్థానాన్ని బిజెపి పూర్తి చేస్తుండడం మరో విశేషం. ఇక ఈ పార్టీ నెమ్మది నెమ్మదిగా నే అయినా భారీగానే పుంజుకుంటుంది. తాజా అంచనాల్లో ఈ పార్టీకి మెజారిటీ సర్వేలు 8 నుంచి 10 సీట్లు వస్తాయి అని చెప్పడం సంచలనం. ఎందుకంటే నాలుగు నుంచి పదికి ఎగబాకడం అంటే మామూలు విషయం కాదు. దీంతో బిఆర్ఎస్ వచ్చే ఐదేళ్లలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందని ఆశక్తి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: