పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ తమ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లకు కీలకమైన రూల్స్ ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ మీద ఓటు ఎవరికీ నమోదు కాకపోతే దానిని పక్కన పెట్టేస్తారు, ఒకటికంటే ఎక్కువ అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు. బ్యాలెట్ పేపర్ చిరిగినా.. గుర్తుపట్టలేనంతగా మారినా దానినీ రిజెక్ట్ చేస్తారు. అంతేకాదు ఓటు ఎవరికి వేసాము అనేది తెలుపుతూ ఏదైనా గుర్తు వేసినా దానిని చెల్లని ఓటుగా పక్కన పెట్టేస్తారు. ఫేక్ బ్యాలెట్ పేపర్లను కూడా తీసేస్తారు. ఇలా పక్కన ఉంచిన బ్యాలెట్ పేపర్లన్నీ ఆర్వో ఆఫీసర్ సేకరించి, ఒక కట్ట కట్టి సైడ్‌లో ఉంచుతారు.

 ప్రతి దశలో చెల్లని ఓట్లను సెపరేట్ గా ఒక కట్ట లాగా ఆయన కట్టేస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపులు కంప్లీట్ అయ్యాక గెలిచిన అభ్యర్థి ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కంటే తక్కువగా ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు. రిజెక్ట్ చేసిన బ్యాలెట్ పేపర్లను ఒక్కొక్కరు పరిశీలించి తుది లెక్కను ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13a ఇందులో అత్యంత కీలకమని చెబుతున్నారు. ఓటర్ తమ ఓటును aలో పొందుపరిచి, దానికి డిక్లరేషన్ 13aలో జత చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటినీ కవర్ బీలో ఉంచాలి. దాని తర్వాత బ్యాలెట్ బాక్స్ లో వేయాలి. దాన్ని ఓపెన్ చేయగానే బ్యాలెట్ a పేపర్‌లో ఉన్న దాన్ని తెరవకూడదు.

కవర్ బి ఓపెన్ చేశాక అందులో ఫారం 13cలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఓటర్ ఇచ్చిన డిక్లరేషన్ 13a ఫారం ఉండాలి. ఇవి రెండు విడివిడిగా ఉండాలి లేకపోతే వాటిని చెల్లని ఓటుగా పక్కన పెట్టాలి. అనంతరం 13a డిక్లరేషన్ సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ డెకరేషన్ ఫారంపై ఓటర్ సంతకం తో పాటు, అటెస్టింగ్‌ ఆఫీసర్ సైన్, సీలు చెక్ చేయాలి. ఒకవేళ అటెస్టింగ్‌ ఆఫీసర్ సంతకం ఉండి, సీలు లేకపోతే దానిని కూడా కౌంట్ చేయాలని ఈసీ సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే దీనిపై వైయస్ జగన్ హైకోర్టుకు ఎక్కగా ఈసీ చెప్పినట్లే వినాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ ఆఫీసర్ సంతకం విషయంలో ఏదైనా అనుమానం ఉంటే ఆర్‌వో ఆఫీసర్ కి అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. అధికారి సంతకం పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న సంతకం ఒకటేనా కాదా అని సరి చూస్తారు. ఒకటే అయితే ఆమోదిస్తారు లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: