ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ అధికారంలో ఉంది. దాదాపు 10 సంస్థలు ఈ పార్టీ ఓడిపోతుంద ని.. ఈ దఫా గద్దె దిగడం ఖాయమని అంచనాలు వేశాయి. విశ్వసనీయ సంస్థలు కూడా.. దాదాపు ఇదే మాట చెబుతున్నాయి. ఆరా మస్తాన్‌వంటి సంస్థలు కూడా.. బొటా బొటి మార్కులు వేశాయి. దీంతో వైసీపీ రేపు దురదృష్టవశాత్తు పార్టీఓ డితే.. పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా.. 151 మంది ఎమ్మెల్యేల్లో 70 మంది ఎమ్మెల్యేలు.. సాఫ్ట్ కార్నర్ ఉన్న నాయకులే.
వీరిలో సగం మంది మరింత సాఫ్ట్ కార్నర్ ఉన్న నాయకులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరు కనుక ఓడితే.. పూర్తిగా పార్టీ అధికారంలోకి రావడమే కష్టమైతే.. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు దీనికి పూచీ వహిస్తారు? అనే చర్చ ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఆది నుంచి బాధ్యత విషయంలో పార్టీ అధినేత,, సీఎం జగన్... రెండు రూపాల్లో వ్యవహరిస్తూ వచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం అన్నప్పుడు.. ఎమ్మెల్యేల పనితీరుతోనే గెలుస్తామని చెప్పారు. తర్వాత వలంటీర్ల వ్యవస్థ కారణంగానే విజయం దక్కించుకుంటామన్నారు.
తీరా చూస్తే.. చివరకు మొ త్తం తనపైనే భారం వేసుకున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ గెలిస్తే.. ఆ క్రెడిట్ అంతా కూడా...వైసీపీ అధినే తకు చేరిపోతుందని సీనియర్ లీడర్లు చెబుతున్నారు. ఒకవేళ ఓడితే... అంటే మాత్రం వారు మౌనంగా ఉంటున్నారు. నిజానికి నియోజకవర్గానికి ఇద్దరేసి ఇంచార్జ్‌లను నియమించారు. కీలక స్థానాల్లో అనేక మందికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారికి ఈ ఓటమి పాపం చుట్టుకుంటుందా? లేద జగనే భరిస్తారా? అనేదిచూడాలి.