తండ్రిని మించిన త‌న‌యులు.. వివిధ రంగాల్లోఉన్నారు. కానీ, రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌రికి మాత్రం మ‌న‌కు త‌క్కువ‌గా క‌నిపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు రాహుల్‌ను తీసుకుంటే.. కాంగ్రెస్‌లో ఆయ‌న తండ్రి రాజీవ్‌కు ఉన్న ఇమేజ్‌ను సొంతం చేసుకోలేక పోయారు. టీడీపీలో యువ నేత‌గా ఉన్న నారా లోకేష్ చంద్ర‌బాబు స్థాయిని చేరుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, తెలంగాణ కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ కూడా.. తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. గ‌త‌ప‌దేళ్లు ఒక వెలుగు వెలిగారు. కానీ, పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.


అయితే.. ఇప్పుడు రాజ‌కీయ వార‌సులుగా తొలిసారి.. అసెంబ్లీ బ‌రిలో ఉన్న ముగ్గురు య‌వ నేత‌లు.. వారి వారి తండ్రుల‌ను మించి రాజ‌కీయాలు చేస్తామ‌ని చెబుతున్నారు. చిత్రం ఏంటంటే..  వీరంతా కూడా.. 30 ఏళ్లు దాట‌ని వారే కావ‌డం. వారిలో పేర్ని సాయి కృష్ణ‌మూర్తి ఒక‌రు. ఈయ‌న మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని వెంక‌ట్రామ‌య్య‌.. ఉర‌ఫ్ నాని వార‌సుడు. సుదీర్ఘ వార‌స‌త్వం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చారు. తొలిసారి బ‌రిలో ఉన్నారు. ఎంబీఏ వంటి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు.


రాజ‌కీయాల్లో తండ్రి పేర్ని నాని.. కొంత సుతిమెత్త‌గా ఉంటూ.. చుర‌క‌లు అంటించే మ‌న‌స్త‌త్వంతో ముందుకు సాగితే.. కిట్టు మాత్రం దూకుడు ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. ఇక‌, భూమ‌న మోహిత్ రెడ్డి మ‌రో వార‌సుడు. తండ్రి క‌రుణాక‌ర్ రెడ్డి కుమారుడుగా తిరుప‌తి అసెంబ్లీ బ‌రిలో ఉన్నారు. స్థానికంగా కార్పొరేట‌ర్ కూడా. ఈయ‌న సైన్స్‌లో ఎంఎస్సీ చేశారు. చిన్న‌వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తండ్రితో పాటు ఈయ‌న కూడా సైలెంట్ రాజ‌కీయాలు చేస్తున్నారు.


న‌గ‌రాన్ని అభివృద్ధి చేయ‌డంలో మంచి దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈయ‌న చంద్ర‌గిరి ఎమ్మెల్యే  వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు భాస్క‌ర‌రెడ్డి ముద్దుల కుమారుడు. ఉన్న‌త విద్య అయినా.. ఐఐటీ చ‌దివారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.  స్తానికంగా కూడా ఆయ‌న ఎదిగారు. క్రికెట్ అసోసియేష‌న్ నేత‌గా కూడా ఉన్నారు. ఈయ‌న కూడా.. తండ్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చంద్ర‌గిరి నుంచే ఈద‌ఫా తొలిసారి పోటీలో ఉన్నారు. మ‌రి ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: