రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలోనే ఈసారి రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విపక్షాలు గెలుపు విషయమై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొన్ని గంటల్లో ఎవరి లెక్కలేమిటో తేలిపోనున్నాయి. అవును, మరో 24 గంటల్లో గెలుపు ఓటమిలు నిర్ణయించబడతాయి. ఈలోగా ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. రాష్ట్రంలో చాలా మటుకు కూటమికే ఓటేశాయి. ఇక అధికార వైసీపీ మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇక ఇపుడు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఇపుడు అందరి దృష్టి కూడా అభ్యర్థుల భారీ మెజారిటీ పైకి మళ్లింది. ఒకసారి ఆ పరిశీలన చేస్తేగనుక ఈసారి ఆశ్చర్య గొలిపే విధంగా అంచనాలు ఉన్నాయి అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు.

చాలా మీడియా సంస్థలు జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకు రావడం విశేషం. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని భోగట్టా. అదేవిధంగా వైస్సార్సీపీ అధినేత వైస్ జగన్ ఈసారి కూడా మంచి మెజారిటీతో గెలవనున్నట్టు అంచనాలు నెలకొన్నాయి. ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మరలా హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు.

మొత్తంగా ఓవరాల్ అంచనాల ప్రకారం అయితే ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 100 నుంచి 120 స్థానాలు గెలుచుకోవచ్చని, వైసీపీకి 50 నుంచి 70 స్థానాలు లభిస్తాయని వివరించారు. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో కూటమికి  13 నుంచి 15 స్థానాలు, వైసీపీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని, పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ పోటీ చేసాడు కాబట్టి. అందుకే ఆ ప్రాంతానికి ఇపుడు మంచి పేరు వచ్చింది. అవును, ఇపుడు అంతటా పవన్ కళ్యాణ్ మెజార్టీ పైనే చర్చ. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని, రాష్ట్రంలోని అందరికంటే ఎక్కువ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని మెజారిటీ ప్రజలు లక్షకు ఐదు లక్షలు అంటూ బెట్టింగులు కడుతున్నారని టాక్ వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: