ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు రేపటి రోజున తేలబోతున్నాయి.. ఎవరు ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం అనే విషయం కూడా రేపటితో పుల్ స్టాప్ పడింది.. అయితే ఐదేళ్లు వైసిపి ప్రభుత్వం నవరత్నాల పేరుతో మహిళలకు చాలా పథకాలనే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మహిళలు ఓటింగ్ వైసిపి పార్టీకే పడిందని చాలా సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. కానీ పురుషుల ఓట్లు మాత్రం యాంటీ జగన్ కు ఓటు వేశారన్నట్లుగా మరికొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి .ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే అవి అవును అనే విధంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే జగన్ ఇచ్చినంత డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు.. రేపటి రోజున చంద్రబాబు వచ్చినా కూడా జగన్ ప్రభుత్వ పథకాలని అమలు చేయవలసి ఉంటుంది. సంక్షేమ రూపంలో ఇంతటి క్యాష్  ని ఇవ్వడం కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది ఇప్పటివరకు ఎవరు కూడా ఇవ్వలేదు.. అయితే ఈ డబ్బు మహిళలకు చాలా సాధికారత తీసుకువచ్చింది. ఒక కోటి 45 లక్షల కుటుంబాలకు.. ఎంతో కొంత డబ్బులు సైతం వచ్చాయి. పదివేల నుంచి 50 వేల వరకు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఐదేళ్లలో ఒక్కో మహిళ 50 నుంచి రెండున్నర లక్ష దాకా తీసుకున్నారు.


ఏదో ఒక రూపంలో నవరత్నాల పేరుతో మహిళలకు డబ్బులు అందాయి. ఈ డబ్బులే ఇళ్లల్లో విభేదాలు సృష్టించాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పురుషులలో జగన్ పైన ద్వేషాన్ని పెంచిందా అనే విధంగా వార్తలు వస్తున్నాయి. మహిళలకు మాత్రమే డబ్బులు ఇవ్వడంతో మగవారికి కోపం వచ్చేలా చేసిందట. ఇంట్లో డబ్బుల కోసం చేతులు చాచే పరిస్థితి తగ్గిపోయి. వారే అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చిందట. మద్యం ధరలు పెరగడం వంటివి పురుషులకు కోపాన్ని తెప్పించాయట. అయితే ఇంట్లో పనివాళ్ళు దొరక్కకపోయినా రైతులకు కూలీలు దొరకకపోయినా కేవలం జగన్ ఇచ్చిన డబ్బుల వల్లే అందుకు కారణం అన్నట్టుగా తెలియజేస్తున్నారు. అందుకే చాలా చోట్ల వైసిపికి ఓటు శాతం తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రేపటి రోజున దీని ఫలితం ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: