ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడంతో విపక్షాలు ఎవరికి వారు ముందస్తుగానే సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అయిపోయాయి. ఎందుకంటే గెలుపు ధీమా ఎవరిపై వారికుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంపై క్లారిటీ ఇంకా స్పష్టంగా రాలేదు అనేవారు లేకపోలేదు. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. పలు సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి ఎన్నికల ముందు చేసే ప్రీపోల్ సర్వేలు అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రీ పోల్ సర్వే ఫలితాలు మారే అవకాశం ఇక్కడ లేకపోలేదు. అయితే అందుకే ఒక నెంబర్ అటు ఇటు అయినా.. ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో దాదాపు అన్ని సర్వే సంస్థలూ ఒకే తరహా ఫలితాలు ఇస్తాయని అంటుంటారు మేధావులు.

అయితే, ఏపీ ఫలితాల విషయంలో మాత్రమే ఇలా జరిగిందని కొందరి విశ్లేషణ. జాతీయ స్థాయిలోని మీడియా సంస్థలు మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సంగతి విదితమే. ఇక ఎగ్జాట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో సుమారుగా అన్ని సంస్థలూ ఒకేలా అంచనాలు వెల్లడించాయి. పది సీట్లు అటు ఇటు అయినప్పటికీ.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పడం జరిగింది. దీంతో ఇవే కరెక్ట్ ఎగ్జిట్ పోల్స్, ఏపీలో వెలువడినవి అంత ఖచ్చితంగా లేవని అంటున్నారు సో కాల్డ్ మేధావులు.

ఇకపోతే ఏపీలో ప్రీపోల్ సర్వేలను మించిన తారతమ్యాలు ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో వెలువడ్డాయని అంటున్నారు. దానికి కారణం.. ఏపీలో కొన్ని సంస్థలు వైసీపీ అనుకూలంగా చెబితే, ఇంకొన్ని సంస్థలు మాత్రం కూటమిదే విజయం అని చెప్పాయి. దీంతో... ఎవరిని నచ్చిన ఫలితాలను ఆయా పార్టీలు, వారికి అనుకూలమైన మీడియా సంస్థలూ ప్రకటించుకున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో... అసలు ఇవి ఎగ్జిట్ పోల్ ఫలితాలా.. లేక, ఆయా సంస్థలు వారి వారి కోరికలను ఈ ఫలితాల రూపంలో బయటపెట్టాయా అనే సందేహాలు ఇపుడు చాలామందిని తొలుస్తున్నాయి. జనాలను వెర్రివాళ్లను చేస్తూ, ఒకరోజు హల్ చల్ చేయడానికి మాత్రమే ఆ పోల్స్ పనికి వస్తాయని, అంతకు మించి ఇంకేదేనికీ పనికి రావని అంటున్నారు. ఏది ఏమైనా.. జూన్ 4 న కౌంటింగ్ ప్రక్రియ మొదలవ్వబోతుంది.. సాయంత్రానికైతే ఎవరి లెక్కలు ఏమిటో తేలిపోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: