ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అంతటా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరే మార్మోగుతోంది. ఆయన ఎంత మెజారిటీతో గెలవబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం పోలింగ్ నమోదయింది. చరిత్రలో ఎంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదు కావడం ఇదే తొలిసారి. పోలింగ్ తేదీన అర్ధరాత్రి వరకు క్యూలో ఉండి మరీ మహిళలు ఓట్లు వేశారు. అయితే జూన్ 1వ తేదీ విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని వెల్లడించాయి.

చాలా తక్కువ సర్వేలు మాత్రమే వంగా గీత గెలుస్తున్నట్లు తెలిపాయి. ఇకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టారు. గోదావరి జిల్లా మొత్తం తిరుగుతూ బాగా ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన తిరగని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రజలు భ్రమరథం పట్టారు. పవన్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారు అని చెప్పుకోవచ్చు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ 60 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని సంచలన అంచనా వేశారు. పవన్ విజయం కొన్ని నెలపాటు మాట్లాడుకునే లాగా ఉండబోతుందని కొందరు అభిప్రాయపడ్డారు.

ఇంకా జనసేన కార్యకర్తలు ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడు సంబరాలు చేసుకోవాలా? అని వారు బాగా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నంతో వైసీపీ పార్టీ అధికారాన్ని నిలుపుకుంటుందా లేదా టిడిపి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే సంగతి కూడా తెలిసిపోతుంది ఈరోజే సార్వత్రిక ఎన్నికల లెక్కింపు కూడా జరగనుంది. దాంతో కేంద్రంలో మళ్లీ మోదీయే వస్తారా అనేది కూడా తెలిసిపోతుంది. మోదీయే గెలుస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం మాకు 295 సీట్లు రాబోతున్నాయని గంటా పథంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: