ప్రపంచ ప్రజాస్వామ్యానికే అతిపెద్ద జాతర అయినా భారతదేశ లోక్ స‌భ , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి అధికార వైసీపీ విజయం సాధిస్తుందా..? తెలుగుదేశం, జనసేన, బీజేపి మూడు పార్టీల ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధిస్తుందా..? అన్నది ఎగ్జిట్ పోల్స్ సైతం కరెక్టుగా అంచనా వేయలేకపోయాయి. ఎవ‌రి అంచ‌నాలు వారు వేశారు. క్లీయ‌ర్ పిక్చ‌ర్ ఇవ్వ‌లేదు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది సహజంగానే ఉత్కంఠగా మారింది ఈరోజు ఉదయం ప్రారంభమైన కౌంటింగ్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాక్ అనుకోవాలి..


ప‌వ‌న్ ఖ‌చ్చితంగా భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తార‌న్న అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో ఎక్కువుగా కూట‌మికే ప‌డ‌తాయ‌ని అంద‌రూ అనుక‌న్నారు. అయితే ఈ టైంలో ఓట్లు చెల్ల‌న‌వి ఎక్కువ రావ‌డం కాస్త ఇబ్బందే అనుకోవాలి. తొలి రౌండ్‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ల కౌంటింగ్‌లో ఎక్కువ చెల్ల‌ని ఓట్లు వ‌చ్చాయి. ఇది నిజంగానే ప‌వ‌న్‌కు పెద్ద మైన‌స్ అనుకోవాలి. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన ఇత‌రుల‌లో మండ‌పేట‌లో వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు , నెల్లూరు సిటీలో మంత్రి నారాయ‌ణ , కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు , రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి .. టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి లీడ్‌లో ఉన్నారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఎక్కువుగా కూట‌మి అభ్య‌ర్థులు లీడ్ లో ఉన్న ట్టు ట్రెండ్స్ చెపుతున్నాయి.


ఏపీ అసెంబ్లీ , పార్ల‌మెంట్ , తెలంగాణ పార్ల‌మెంట్ , ఇండియా పార్ల‌మెంట్ . . .  ఎన్నిక‌ల కౌంటింగ్ , లైవ్ అప్‌డేట్స్ , విశ్లేష‌ణాత్మ‌క , స‌మ‌గ్ర‌ క‌థ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందించేందుకు indiaherald.com ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: