విజయనగరం జిల్లాలోని అత్యంత కీలక అసెంబ్లీ స్థానాలలో బొబ్బిలి నియోజకవర్గం ఒకటి. ఇక ఈ నియోజకవర్గం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా వెంకట చిన అప్పలనాయుడు బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా ఆర్ వి ఎస్  కే కే రంగారావు బరిలో ఉన్నారు. ఇక ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరిపి విద్య సాగర్ బరిలో ఉన్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మరిపి విద్యా సాగర్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు అని ఇక్కడ జనాలు అభిప్రాయ పడ్డారు.

అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు అనే తమ అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. ఇకపోతే మొదటి నుండి కూడా గట్టి పోటీ వైసీపీ అభ్యర్థి అయినటువంటి వెంకట చిన్న అప్పలనాయుడు , టిడిపి అభ్యర్థి అయినటువంటి రంగారావు మధ్యనే అని జనాలు అంచనా వేశారు. ఇక అన్నట్లుగానే వీరిద్దరి మధ్య పోటీ ఉంది. కాకపోతే ఈ ఇద్దరి మధ్య పోటీలో కూడా వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.

ఇప్పటివరకు ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన చాలా రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులో భాగంగా టి డి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి రంగారావుకి 18260 ఓట్లు రాగా , వైసిపి పార్టీ అభ్యర్థి అప్పలనాయుడుకు 11104 ఓట్లు వచ్చాయి. దానితో అప్పలనాయుడు కంటే కూడా రంగా రావు 7156 ఓట్ల మెజారిటీ లో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈయన భారీ మెజార్టీని సంపాదించుకున్నాడు. దీనిని క్రాస్ చేసి వై సి పి పార్టీ అభ్యర్థి గెలుపొందడం కాస్త కష్టమైన విషయమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: