ఏపీలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ విధానం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2004 నుంచి ప్రస్తుత ఎన్నికల దాకా ఎక్కువగా పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. అది ఇప్పటికి కొనసాగుతునేవుంది.2004లో లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో దిగి గెలుపొందారు. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యక్తిగత పరంగా వస్తే ఆయనది మాచర్లలోని వెల్దుర్ది గ్రామం.ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972లోనే ఇండిపెండెంట్ట్ గా బరిలో నిల్చి గెలుపొందారు.తర్వాత 1999లో నాగిరెడ్డి భార్య అయినా జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు ఆయన తర్వాత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రాజకీయం రంగ ప్రవేశం చేసి 2009,2012 లో విజయం సాధించారు.


గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలుపొందారు.అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని ఢీ కొట్టాలంటే టీడీపీ అధినేతకు ఒక సవాల్ గా మారింది.కనుక ఆయనకు ధీటుగా పనిచేసే నాయకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టి చివరకు బ్రహ్మారెడ్డిని బరిలోకి దించింది.ఆయన్ని మాచర్లటీడీపీపార్టీ ఇంఛార్జ్‌గా నియమించారు అధినేత చంద్రబాబునాయుడు.ఆ తరువాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవి చూశారు.ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం మూడు రౌండ్లు ముగిసే సమయానికి టిడిపి అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై  ఆదిక్యంతో ఉన్నారు.ఒకవేళ పిన్నెల్లి ఓడిపోతే అతని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పోలింగ్ టైంలో పోలింగ్ కేంద్రం వద్ద  పిన్నెల్లి చేసిన ఈవీఎంలు ధ్వంసం అనే అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. జూన్ 6వ వరకు పిన్నెల్లి పై ఎలాంటి చట్టపైన అంశాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే పిన్నెల్లి పరిస్థితి ఏంటి అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: