ఏపీలో మొదటి నుంచి అనుకున్నదే జరుగుతోంది.ఇక్కడ తమిళనాడు లాగే ఫలితాలు అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి కూడా ఆ విధంగానే రిజల్ట్ ఉంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో  మే 13న హోరాహోరీ ఎలక్షన్స్ జరిగాయి.  ఈ క్రమంలో మహిళలు,వృద్ధులు, వితంతువులు,వికలాంగులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు అయితే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓట్లు వేశారు. ఈసారి ఎక్కువ ఓటింగ్ శాతం పెరగడంతో  మహిళలు ఎక్కువగా ఓటింగ్ వేయడానికి ఉత్సాహం చూపించడంతో వైసిపి ఈ ఓట్లు అన్ని తమకే పడుతున్నాయని మా సంక్షేమ ఫలాల వల్లే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు అని భావించారు. 

అంతే కాకుండా వైసీపీ విజయం ఖరారు అయినట్టే అని  జగన్మోహన్ రెడ్డి కూడా 151 పైగా అసెంబ్లీ సీట్లలో మేము గెలుస్తామని 22 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పారు. కానీ టిడిపి కూటమి చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది.  కానీ ఈసారి ఫలితాలు మాత్రం చాలా వెరైటీగా వస్తున్నాయి.  జగన్ అనుకున్న దానికి వ్యతిరేకంగా కూటమి సునామీలా దూసుకుపోతోంది. మొత్తం 155 స్థానాల్లో ఇప్పటివరకు లీడింగ్ లో ఉంది. 20 లోక్ సభ స్థానాల్లో పై చేయి సాధిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు విజయోత్సవాల్లో మునిగిపోయారు. అయితే వైసిపి భావించినట్టు  జగన్ చేసిన సంక్షేమాన్ని ప్రజలు నమ్మలేకపోయారు.

దీనికి కారణం పథకాలు ప్రభుత్వం బాగానే ప్రకటించింది కానీ కిందిస్థాయి నాయకులే ప్రజలను భయపెట్టి మరి ఇబ్బందులకు గురి చేశారనే అపోహ ఉంది. దీనివల్ల ఎంతో సఫర్ అయినటువంటి ప్రజలు  ఈసారి మూకుమ్మడిగా టిడిపి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు జనసేన కూడా తోడవడంతో ఆ ఓట్లు కూడా టిడిపి వైపే మల్లడంతో రికార్డు స్థాయిలో టిడిపికి ఓట్లు పడ్డాయి.  ఫలితాలు కూడా ఆ విధంగానే రాబోతున్నాయని జగన్ సంక్షేమాలను ప్రజలు నమ్మలేకపోయారనేది కూడా అర్థమవుతుంది. మిగతా రౌండ్స్ లో వైసీపీ ఏమైనా పుంజుకుంటుందా లేదంటే టీడీపీ హవానే కొనసాగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: