అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి  బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్న విధంగా తయారయింది ఏపీలో జగన్ పరిస్థితి.  ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆయన తప్పక విజయం సాధిస్తారని నమ్మకం తోనే ఉన్నారు.ఈ ఫలితాలే తనకు గెలుపు వైపు తీసుకెళ్తాయని ఆశించారు. అంతేకాకుండా ఆయన ప్రచారంలో కూడా వైసిపి వేవ్ కనిపించింది.  కానీ ఓట్ల వరకు వెళ్లే సరికి ప్రజలంతా ముకుమ్మడిగా టిడిపి కూటమి కే గుద్దినట్టు తెలుస్తోంది.  ఒక్కొక్క రౌండ్ బయటకు వచ్చినా కొలది టిడిపి మరింత లీడింగ్ లోకి వెళ్లి పోతుంది వైసిపి చతికిల పడుతోంది. దాదాపుగా 2019లో సాధించిన సీట్ల కంటే ఈసారి టిడిపి ఇంకా రికార్డు స్థాయి లో పెరిగే అవకాశం ఉంది. 

 చివరికి వైసిపి కి కంచుకోటలా ఉండే కడప లో కూడా టిడిపి వెనుకబడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం  వైసీపీ కి కనీసం 20 అసెంబ్లీ సీట్లు కూడా దాటే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రతి ప్రచారం లో జగన్ మీ బిడ్డని నేను .. మీలో ఒక్కడిని అంటూ ప్రచారం సాగించారు. అయినా ఆయనను ఫ్యామిలీ మెంబర్ గా ఆదరించలేకపోయారు ఏపీ ప్రజలు. ఇంటి కి వచ్చి అన్ని పథకాలు అందించినటువంటి వాలంటీర్ల ను కూడా పక్కనపెట్టి  చంద్రబాబు వైపు మోగ్గారు. వారి ఓట్లతో వైసిపి నాయకుల కు  చుక్కలు చూపించారని చెప్పవచ్చు.

జనాలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని ఈసారి నిరూపించారు. అంతేకాకుండా జగన్ తీసుకొచ్చిన పథకాలు కూడా ఫ్యామిలీ ఓట్లను ఆకట్టుకోలేకపోయాయి.  అలాగే టీడీపీ కూటమి బస్సు ఫ్రీ పథకాల గురించి చెప్పి  చాలామంది ని ఆకట్టుకుంది. ఈ విధంగా జగన్ ఎంత ప్రయత్నం చేసినా  ప్రజ ఫ్యామిలీ లో ఒక్కడి గా నిలువలేకపోయారని చెప్పవచ్చు. మరి చూడాలి టిడిపి కి ఎంత లీడ్ వస్తుంది. వైసీపీ ఎన్ని సీట్లకు పరిమితం అవుతుంది అనేది కొన్ని గంటల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: