ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వైసీపీకి గట్టిగానే ఎదురుగాలి తగిలినట్లు ఉంది. భారీ మెజారిటీ దిశగా టీడీపీ కూటమి దూసుకుపోతున్న వేళ చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకుని సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ కౌంటింగ్ సెంటర్ల నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.

కౌంట్ డౌన్ మొదలు కాగానే ప్రజలు వైసీపీ డౌన్ డౌన్ అనేసారని స్పష్టంగా తెలిసింది. సంక్షేమ పథకాలను జగన్ మోహన్ రెడ్డి ఎంతో చక్కగా అమలు చేశారు. అమ్మ వడి, నాడు నేడు, వాలంటీర్ వ్యవస్థ ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజలను బాగు చేశారు కానీ చివరికి వారే వైసీపీ ఓటమికి కారణమయ్యారు. అభివృద్ధి లేదనే పేరుతో, రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో వారు టీడీపీకి ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేశారు. ఆయనను ఎవరూ నమ్మరు అనుకున్నారు కానీ ఆయన తెచ్చిన సూపర్ సిక్స్ గ్యారెంటీలను ప్రజలు బాగా నమ్మేసినట్లు ఉన్నారు. అంతేకాదు ఆయన పింఛన్ల అమౌంట్ పెంచుతానని అన్నారు. మేనిఫెస్టోలో రకరకాల హామీలను పొందుపరిచారు  వీటన్నిటినీ ప్రజలు నమ్మేసి వైసీపీకి డౌన్‌ డౌన్ చెప్పేసినట్టు తెలుస్తోంది.

రాయలసీమ ప్రజలు కూడా ఈసారి టీడీపీకే పట్టం కట్టడం విశేషం. ఇప్పటిదాక టీడీపీ 118 అసెంబ్లీ స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. వైసీపీ 13 స్థానాల్లో లీడింగ్ తో గెలవలేనంత వెనకంజలో పడింది. పార్లమెంటు ఫలితాలు కూడా సేమ్ ఇలానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఏపీ ప్రజల తీర్పుతో ఇకపై ఏ సీఎం కూడా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి జంకుతారు అని చెప్పవచ్చు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ఇప్పుడు అతి పెద్ద సవాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: