ఆత్మ విమర్శకి ఓదార్పు కచ్చితంగా అవసరమే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తనని తానే నమ్ముకుంటూ తాను అనుకున్నవే నిజమవుతాయనే ఒక భ్రమలో ఉండేవారు.. కానీ వాటన్నింటినీ ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా చెరిపి వేసారని తెలుస్తోంది. ముఖ్యంగా తాను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టానని.. అవే తనను మళ్ళీ గెలిపిస్తాయని వైనాట్ 175 అంటూ ప్రగల్బాలు పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ..కానీ ఆయన ఎవరికి సంక్షేమాన్ని అందిస్తున్నారు.. ఎవరికి ద్రోహం చేస్తున్నారు అనే విషయాలను మాత్రం పట్టించుకోలేకపోయారు. కేవలం నవరత్నాలు అంటూ తొమ్మిది పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలపైనే ఫోకస్ చేశాడే తప్ప అతడి వల్ల నష్టపోతున్న చాలామంది గురించి ఆలోచించ లేకపోయారు.. ఇప్పుడు వారే ఆయనకు గట్టి దెబ్బ తగిలేలా చేశారని స్పష్టం అవుతుంది.

ముఖ్యంగా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు,  యువత చాలా మంది జగన్ వల్ల లాభపడ్డారు అని ఒక్కచోట కూడా ఏ ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు లేవు.. కేవలం పేద ప్రజలు,  ఎస్సీ ఎస్టీ అంటూ వీరిపైనే ఫోకస్ పెట్టారు..  కానీ రాష్ట్రంలో 9 కోట్ల మందికి పైగా జనాలు ఉండగా అందరి పైన ఆయన ఫోకస్ చేయలేకపోయారు.. ఇక్కడే ఆయనకు భారీగా దెబ్బ పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అణగారిన ప్రజలు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఓట్లు వేశారో లేదో కూడా తెలియని పరిస్థితి.. వారిని నమ్ముకున్న జగన్ పూర్తిస్థాయిలో మునిగిపోయారు.. అందరికీ ఓదార్పు అవసరమైతే ఇప్పుడు జగన్ తనకు తానే ఆత్మ ఓదార్పు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అంతేకాదు తాను చేసిన తప్పును తానే తెలుసుకొని తనను తానే విమర్శించుకునే సమయం కూడా వచ్చిందనే చెప్పాలి.


ఒక నాయకుడు అంటే కేవలం అట్టడుగు,  బలహీనవర్గాలను మాత్రమే కాదు అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం చేసినప్పుడే సరైన నాయకుడు అవుతాడు.. అయితే ఈసారి జగన్ ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారని స్పష్టమవుతుంది. ఈ విషయంలో ప్రజలు పూర్తిగా జగన్ను నమ్మకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.. ఏది ఏమైనా జగన్ తాను నమ్ముకున్న గుడ్డి ఆలోచనలను వదిలిపెడితే తప్ప మళ్ళీ వచ్చే ఎన్నికలలో గెలుపొందరు అని స్పష్టం అవుతుంది. మొత్తానికైతే ఇక్కడ టిడిపి మాస్టర్ ప్లాన్ పక్కాగా ఫలించింది అని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: