ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పలనాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెల్సిందే. దానికి కారణం మే 13వ తేదీన పోలింగ్ రోజు పిన్నెల్లి  చేసిన రాద్ధాంతం.వైసీపీ నుండి అధికార సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోటీ చేయాగా టిడిపి నుండి జూలకంటి బ్రహ్మారెడ్డి బరిలో ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2004లో ప్రారంభమైన పిన్నెల్లి కుటుంబం హవా ఇప్పటికి కొనసాగుతునేవుంది.అసలు ఈ ఫ్యామిలీని ఎదిరించి పోటీ చేసి గెలిచే దమ్ము ఏ టిడిపి నేతకు లేకుండా పోయింది. అయితే బ్రహ్మారెడ్డి వ్యక్తిగత పరంగా వస్తే ఆయనది మాచర్లలోని వెల్దుర్ది గ్రామం.ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972లోనే ఇండిపెండెంట్ట్ గా బరిలో నిల్చి గెలుపొందారు.తర్వాత 1999లో నాగిరెడ్డి భార్య అయినా జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు 2004 - 2009 ఎన్నికలలో ఇదే జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేసి పిన్మెల్లి ఫ్యామిలీ చేతిలో చావు దెబ్బ తిన్నారు. 1999లో మాత్రం బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికలలో కొమ్మారెడ్డి చలమారెడ్డి కి సిటు ఇవ్వ గా ఆయన కూడా ఓడిపోయారు. అంతకు ముందు 2012 ఉప ఎన్నికలలో చిరుమామిళ్ల మధుబాబు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.మూడో రౌండ్ ముగిసే సమయానికి టిడిపి అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై 13639 ఓట్ల ఆదిక్యంతో ఉన్నారు.అయితే పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద పిన్నెల్లి చేసినా రచ్చ అంతా ఇంతా కాదు. తన ఓటమికి ముందే గ్రహించిన పిన్నెల్లి ఆ విధంగా ఈవీఎం ప్యాడ్లలో ఉన్న డేటా నాశనం చేసి బై పోలింగ్ జరిగే విధంగా చూశారన్నది ఈరోజు ఇచ్చిన ఫలితం ఆధారంగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: