ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను మంచి చేస్తే మాత్రమే ఓటేయండని కామెంట్లు చేయగా ఓటర్లు సైతం స్పష్టమైన తీర్పును ఇచ్చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన లీడ్ లో ఉండగా వైసీపీ మాత్రం 30 స్థానాల్లో కూడా విజయం సాధించడం కష్టమని తేలిపోయింది. రాష్ట్రంలో పవర్ స్టార్ సునామీ ఖాయమని వెల్లడైంది. ‘బిడ్డలు’ జగన్ కి హ్యాండ్ స్తే ‘తమ్ముళ్లు’ పవన్ ని భుజాన వేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది.
 
ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపులు ఈ ఎన్నికల ఫలితాలతో చోటు చేసుకోనున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఒంటరిగా బరిలో దిగిన వైసీపీ ఇలా జరుగుతుందని భావిస్తే కనీసం బీజేపీతో అయినా పొత్తు పెట్టుకునేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలనకు ఓటర్లు పాస్ మార్కులు కూడా వేయలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి
 
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో తమ పవర్ ఏంటో చూపించేశారనే చెప్పాలి. ఈ ఎన్నికల ఫలితాలతో పవన్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఏదో ఒకరోజు జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పవన్ సీఎం అవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన నేతలకు భారీ స్థాయిలో మంత్రి పదవులు దక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
 
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ మాధవీలత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. వైసీపీకి ఘోర పరాజయం ఫిక్స్ కావడంతో పాటు 15, 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు సైతం ఈ ఎన్నికల్లో కూటమి సునామీకి కొట్టుకుపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐకమత్యంగా ఎన్నికలకు వెళ్లడమే కూటమికి ప్లస్ అయిందని చెప్పవచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అద్భుతమైన పాలనతో మెప్పిస్తే 2029లో కూడా కూటమికి ఏపీలో తిరుగుండదని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: