ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈసారి వైసీపీ అనూహ్య రీతిలో ఓడిపోతోంది. పోయినసారి 150 సీట్లు వస్తే ఇప్పుడు 20 రావడమే గగనం అయిపోయింది. గడిచిన ఐదేళ్లలో జగన్ రెండు కోట్ల మందికి పైగా తన ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేశారు. ఎంతోమందికి ఇల్లు కట్టించి ఇచ్చారు, ఇళ్ల స్థలాలు కూడా అందజేశారు. ఆటో తోలుకునే వారికి కూడా డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. తోపుడుబండ్ల వారికి, మహిళలకు వృద్ధులకు, చదువుకునే వారికి ఇలా ఒక్కరికేంటి ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా సహాయం చేసి వారు జీవితంలో ముందు అడుగు వేయడానికి చాలా ప్రోత్సాహం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని మంచిని ప్రజలకు చేశారు జగన్. సకాలంలో బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేశారు. ప్రతి కుటుంబానికి ఐదేళ్లలో రెండు లక్షల దాకా డబ్బులను అందజేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని పథకాలను ఇంటికే తీసుకొచ్చి ఇచ్చారు. కొత్తగా రెండు లక్షల ఉద్యోగాలను కూడా సృష్టించారు. పనిచేసిన ఏపీ ప్రజలు తీర్పు మాత్రం ఈసారి చాలా అనూహ్యంగా కనబడింది.

ఏపీ సీఎం జగన్ ప్రజలకు మంచి చేశారన్న మాట వాస్తవమే కానీ కొన్ని విషయాల్లో ఆయన ప్రజలకు ఆగ్రహం తెప్పించేలా ప్రవర్తించారు. ముఖ్యంగా ఆల్కహాల రేట్ల నియంత్రణలో ఫెయిల్ అయ్యారు. కల్తీ మద్యం, చీప్ లిక్కర్‌ విషయంలో కూడా సరిగా వ్యవహరించలేదు. ఇసుక దందా పై విమర్శలు కూడా బాగా వచ్చాయి. మూడు రాజధానులు అని నెగిటివిటీ పెంచుకున్నారు. ఒక రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. కక్ష సాధింపు, పోలవరం వివక్ష కుల సాధింపు వంటి కారణాలు కూడా ఆయనకు మైనస్ అయ్యాయని అంటున్నారు. భారీగా సీట్లు మార్చడం కూడా పెద్ద మైనస్ అయింది. తెలివి లేని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం వల్ల జగన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి అనేది క్రియేట్ అయింది.

యెల్లో మీడియా కూటమికి బలం అయింది. పంచడు కార్యక్రమాలు ఒకటే తమను కాపాడతాయని జగన్ గుడ్డిగా నమ్మేశారు. ఐప్యాక్ సర్వేలను కూడా గుడ్డిగా నమ్మేసి ఎడాపెడా అభ్యర్థులను మార్చేసి పెద్దగా తప్పులు చేసారు. ప్రజలకు జగన్ చేసిన మంచి ఎవరూ చేయరని చెప్పుకోవచ్చు కానీ ఆయన చేసిన తప్పులే ఆయన్ను ముంచేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: