మనం ఒక్కటి తలిస్తే దేవుడు మరొకటి తలిచినట్టు  ఆంధ్రప్రదేశ్లో వైసిపి పరిస్థితి అలాగే తయారైంది. ఎవరికైనా అత్యధికం గా అహంభావం పనికి రాదని  ప్రస్తుత రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. మొండితనం, మొరటు తనం మనలో ఏది ఎక్కువైనా రాజకీయాల్లో వర్కౌట్ అవ్వదు అనేది మనం జగన్మోహన్ రెడ్డి ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. నేను ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారు అనుకున్నారో ఏమో, తనకు నచ్చిన విధంగా మాట్లాడుతూ కడుపు లో కత్తులు పైకి నవ్వులు అనే విధంగా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలను ఏమాత్రం మెస్మరైజ్ చేయలేకపోయారు. 

జగన్మోహన్ రెడ్డి కి క్లీన్ చిట్ ఉంటే సరిపోదు కదా.. ఆయన కింది స్థాయి నాయకులు కూడా ప్రజల్లో కలిసిపోవాలి ప్రజల ఆదరణ పొందాలి.  అధికారం రాగానే విర్రవీగడం, ప్రజలను పీడించడం లాంటివి చేస్తే ఎప్పటికైనా చెంప దెబ్బ తప్పదు అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. తెలంగాణ లో కేసీఆర్ కూడా జగన్ లాగే ఆలోచించి చతికిల పడ్డారు.  జగన్ కూడా ఆయన లాగే ఆలోచించి బోల్తా పడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా  జగన్ ఎలాగైనా నేనే గెలుస్తాననే అపోహ లో మొండితనానికి పోయి టిడిపి కూటమి ని దెబ్బ కొట్టే ప్రయత్నాలలో విఫలమయ్యారని చెప్పవచ్చు. 

చంద్రబాబు మాత్రం ఆయన ఎంత విర్రవీగిన ఏం చేసినా చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. చివరి వరకు కూడా తను ఎలాంటి అపోహలకు పోలేదు ఆడంబరాలు చేయలేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకొని విజయం దిశగా కూటమిని తీసుకెళ్లారని చెప్పవచ్చు. కానీ జగన్ మాత్రం కూటమి నాయకుల ప్లానింగ్ లను అస్సలు గమనించలేకపోయారు. కానీ గెలుస్తానని అపోహలో ఉండిపోయారు.అదే ఆయన కొంపముంచింది అని చెప్పవచ్చు.ఇప్పటికైనా రాజకీయాల్లో మొండితనం, మొరటుతనం వర్కౌట్ అవ్వదనేది ఆలోచన చేసుకోవాలని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: