ఆంధ్రప్రదేశ్లో ఈసారి పార్లమెంటు , అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే.. మే 13వ తేదీన ఎన్నికల పూర్తి అవ్వగా జూన్ 1వ తేదీన చాలా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ముఖ్యంగా ఎన్నో ఎగ్జిట్ పోల్స్ ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి.. కానీ ప్రత్యేకించి ఆరా మస్తాన్ హైలెట్ అవుతూ వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయడమే కాకుండా ఈసారి వైసీపీ గెలవకపోతే తాము మళ్ళీ కనిపించము అంటూ ప్రగల్బాలు పలికారు.. అంతేకాదు ప్రత్యేకంగా పల్నాడులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరా మస్తాన్ ఫలితాలను ఎగ్జిట్ పోల్ రూపంలో వెల్లడించారు. ఆరా మస్తాన్ ఇక్కడ డిబేట్ పోల్ లో కూడా పాల్గొంటూ ఫలితాలు పూర్తయ్యే వరకు ఎదురుచూడండి అంటూ కూడా చెబుతున్నారు.. కానీ తాజాగా వెలువడుతున్న కౌంటింగ్ ఫలితాలను బట్టి చూస్తే కూటమి దెబ్బకి ఆరా మస్తాన్ అబ్బా అనాల్సిందే అంటూ వార్తలు వెలబడుతున్నాయి..

ఇక ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ లో విడుదల చేసిన సమాచారం ప్రకారం.. వైయస్సార్ పార్టీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని.. వైఎస్ఆర్సిపి మళ్లీ గెలుస్తుందని  స్పష్టం చేశారు ఆరా మస్తాన్..  ప్రతిపక్ష టీడీపీ కూటమి 71 నుండి 81 సీట్లకే పరిమితం అవుతుంది అని.. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కరోనా సమయంలో చేసిన పనులు వైఎస్ఆర్సిపికి ఉపయోగపడ్డాయని.. మహిళలు ఏకంగా 56% మంది జగన్ పార్టీకి జై కొట్టారని.. అదే సమయంలో పురుషుల్లో 45.35 శాతం మంది వైఎస్ఆర్ సీపీకి , 51.56% మంది టీడీపీ కూటమికి ఓటేశారని  మస్తాన్ వెల్లడించారు..


ముఖ్యంగా 71 - 81 స్థానాలకు టీడీపీ పరిమితం కాబోతోందని.. ఇతరులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతున్నారని.. సుమారు రెండు శాతం ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కంటే 20 -  25 స్థానాల్లో ఆదిక్యంతో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుందని కూడా మస్తాన్ తెలిపారు.. అయితే మస్తాన్ వెల్లడించిన వివరాల పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా నెటిజన్లు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ కారణంగా లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మూడు సీట్లను కోల్పోతుందని మస్తాన్ అంచనా వేశారు.. అంతేకాదు ఆరా మస్తాన్ చేసిన విషయాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ కూటమి భారీ అఖండ విజయాన్ని సాధిస్తుందని.. ఇక ఆరా మస్తాన్ మళ్లీ కనిపించకూడదు అన్న రేంజ్ లో కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే కోటమి దెబ్బకు ఆరా మస్తాన్ అబ్బా అనాల్సిందే అంటూ  నెటిజన్లు,  టిడిపి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: