ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి ఫలితాల్లో ఫస్ట్ రౌండ్‌ నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధిక్యంతో దూసుకుపోయింది. టీడీపీ కూటమి 132 స్థానాల్లో, జనసేన 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. వైసీపీ పుంజుకో లేని విధంగా వెనుకంజలో ఉంది. మద్యం, అభివృద్ధి లేకపోవడం, అతిగా పంచుడు కార్యక్రమాలు, ఎడాపెడా అభ్యర్థులను మార్చేయడం, రాజధాని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, ఇసుక దందా, ప్రతిపక్షాల ఐక్యత ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చావుకి లక్ష కారణాలు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ఆర్కే రోజా ఒక ఫిలాసఫికల్ ట్వీట్ చేశారు. ఓటమి వేల ఆమె చేసిన ట్వీట్ అందరి చేత వామ్మో ఏంట్రా ఇది అనిపించే లాగా ఉంది. స్మైల్ ఇస్తున్న ఫొటోను పంచుకుంటూ "భయాన్ని విశ్వాసంగా... ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు" అని పేర్కొన్నారు. అయితే ఈమె చెప్పిన వేదాంతం చాలా మందికి అర్థం కావడం లేదు. ఉదయం 8:20 కి ఆమె ఈ కోర్టు పోస్ట్ చేశారు అంటే ఆమెకు ఓడిపోతున్నట్లు ముందుగానే తెలిసిపోయినట్టుంది.

కానీ నిన్న తిరుమలలో మాత్రం జగన్ గెలవబోతున్నారని కామెంట్లు చేశారు. ఈసారి రోజా వంగా గీత లాంటి కొందరు మాత్రమే ఓడిపోతారు అని చాలామంది భావించారు కానీ ఏపీ ప్రజల పల్స్ పట్టుకోలేకపోయారు. జగన్ పరిపాలనల వల్ల ప్రజలు విసిగిపోయి చంద్రబాబు పరిపాలననే బాగుంది అని భావించినట్లు ఉన్నారు. ప్రభుత్వంపై ఇప్పుడున్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని చంద్రబాబు ముందు నుంచి అనుకున్నారు. అదే నిజమైంది. రోడ్లు వేయకపోవడం, మద్యం, అధిక కరెంటు బిల్లులు, చెత్త పన్నులు, రాజధాని లేకపోవడం, అభివృద్ధి చేయకపోవడం, అభ్యర్థుల మార్పు వంటివన్నీ జగన్ కు మైనస్ గా మారాయి. వై నాట్ 175 అన్న జగన్  కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేకపోయారు. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని ఆయన తెలుసుకోకపోవడం రాజకీయాల్లో అనుభవం లేకపోవడానికి నిదర్శనం. ఇకపోతే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి నగరి అభ్యర్థిగా రోజా బరిలో నిలిచారు. ఈసారి ఆమె ఓడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: