అతి ఎప్పుడైనా పనికిరాదు. 40 ఇయర్స్ రాజకీయ  చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లేలా చేశాడు. అప్పటినుంచి ఆయనకు  అపజయం చుట్టుకుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడును జైలుకు పంపారో అప్పుడే టిడిపికి అండగా నిలిచారు చంద్రబాబు ఫ్యామిలి.ఓ వైపు తన సతీమణి నారా భువనేశ్వరి కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలుస్తూ  ప్రజల్లోకి వెళ్ళింది. మరో వైపు నారా లోకేష్ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక ఎప్పుడూ కూడా గడప దాటనటువంటి రాణమ్మ  నారా బ్రాహ్మణి కూడా ఒక అడుగు ముందుకు వేసి మామకు,  భర్తకు  అండగా నిలిచింది.

 అలా ఫ్యామిలీ మొత్తం గడప దాటి బయటకు వచ్చి గెలుపును వారి గుమ్మంలోకి లాక్కెళ్లారు. అంతేకాకుండా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కుటుంబీకులు కూడా గడప దాటి రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేశారు. తన అన్న చిరంజీవి, నాగబాబు,  పవన్ అల్లుళ్లు సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే సురేఖ, వరుణ్ తేజ్, ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం  కూటమికి బాసటగా నిలిచారు.  ఆ కుటుంబీకులు గడప దాటి జనాల్లోకి రావడంతో విజయమనేది వారి నట్టింట్లోకి నడిచి వస్తుంది అనేది వారు నిరూపించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈసారి పవన్ కళ్యాణ్ తన గెలుపును చాలా కీలకంగా తీసుకొని పనిచేశారు.

ఈసారి గెలిస్తే రాజకీయాల్లో ముందుకు లేదంటే చావే దిక్కు అనే తనదైన శైలిలో దూసుకెళ్లారు. తాను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తానో ముందుగానే ప్రజలకు తెలియజేశారు.  ఈ విధంగా టిడిపి కూటమి నాయకులతో పాటు వారి కుటుంబీకులు కూడా కష్టపడి విజయాన్ని వారి నట్టింట్లోకి తీసుకొచ్చారు.  ఇక మరోవైపు జగన్ కుటుంబం మాత్రం సొంత అన్నపై కన్నెర్రా జెసి షర్మిల సునీత అన్నను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. వారు అనుకున్నదే సాధించారు. ఈ విధంగా టిడిపి కూటమికి కుటుంబం కలిసి వస్తే వైసిపిని కుటుంబం కాటు వేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: