అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన లెక్కలు మరోలా ఉన్నాయి. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో జనసేన సత్తా చాటుతోంది. ఒక్క స్థానంలో కూడా గెలవలేడని విమర్శలు మూటగట్టుకున్న పవన్ రాష్ట్రంలో వైట్ నాట్ 175 అన్న జగన్ కు ఈక్వల్ అయ్యే పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ అంటే ఇదీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వైసీపీ కేవలం 17 అసెంబ్లీ స్థానాలలో 3 లోక్ సభ స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండటం గమనార్హం. అంచనాలకు మించి విజయం సొంతమవుతూ ఉండటంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ను తక్కువగా అంచనా వేయడమే జగన్ ఈ పరిస్థితికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీమలో సైతం కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది.
వైసీపీ నూటికి నూరు శాతం గెలుస్తుందని భావించిన నియోజకవర్గాలలో సైతం ఫలితం మారుతుండటం కొసమెరుపు. ఏపీలో కూటమి అధికారంతో కొత్త పథకాలతో ఏపీ ప్రజల భవిష్యత్తు మారబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రావడం ఫిక్స్ కావడంతో హద్దులు మీరి మాట్లాడిన చాలామంది వైసీపీ నేతల పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా జరుగుతుండటం గమనార్హం. వైసీపీ 20 కంటే ఎక్కువ సీట్లు సాధించడం కష్టమని తెలుస్తోంది.