ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల స్వభావం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. వారికి అధికారంలోకి రావాల్సిన సీట్లను కట్టబెట్టి వారిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని చెల్లాచెదురు చేసేసారు. ఆ దఫా వైసీపీ పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను అంటగట్టి వారికి అద్భుతమైన మెజారిటీని అప్పగించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు.

ఇక ఈ సారి ఎగ్జిట్ పోల్స్ , జనాల అంచనా ప్రకారం వైసీపీ , కూటమి మధ్య భారీ పోరు ఉంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చిన పది , ఇరవై సీట్ల తేడాతోనే వస్తారు. ఎవరికి ఘోరమైన ఓటమి ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. మొదటి నుండి కూడా కూటమి కి వేవ్ ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో వేవ్ ఉంటుంది అని ఎవరు ఊహించలేదు. ఇప్పటికే టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలకి సంబంధించిన  159 అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు.

ఇక ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏమిటి అంటే జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తూ ఉంటే 20 స్థానాలలో లీడ్ లో ఉంది. ఇక వై సి పి పార్టీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. దీనితో వై సి పి పార్టీ ఓడిపోయిన పర్లేదు కానీ ప్రధాన ప్రతిపక్ష స్థాయి అయిన దక్కుతుందా ... లేదా అనే కొత్త టెన్షన్ లో ఈ పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమాన వర్గం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి వై సీ పీ కి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయిన దక్కుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: