తాజా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆసక్తి రేపిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూడా. ఒకటి 2019 ఎన్నికలలో ఏపీ ఎంత జగన్ ప్రభంజనం వీచినా కూడా.. రాజమండ్రి సిటీలో మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఏకంగా 32వేల‌ ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంత భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజమండ్రి సిటీలో టీడీపీ ఎమ్మెల్యే భవానికి 32 వేల ఓట్ల మెజార్టీ రావడం జగన్‌కు ఎంత మాత్రం నచ్చలేదు. అందుకే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ మార్గాని భరత్ రామ్‌ ద్వారా రాజమండ్రి సిటీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టించారు.


ఇక భ‌ర‌త్‌ సైతం చాలా వ్యూహాత్మకంగా ఈ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న పక్కా ప్రణాళికతో పనిచేస్తూ వచ్చారు. తన నిధులు అన్ని సిటీ నియోజకవర్గంలో ఖర్చుపెట్టి అభివృద్ధి చేశారు. రాజమండ్రి కార్పోరేషన్ లో 30 డివిజన్లకు పైగా సిటీ నియోజకవర్గంలో విస్తరించి ఉన్నాయి. అయితే ఈసారి ఇక్కడ 2019 ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలు తరఫున అభ్యర్థులు మారిపోయారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని భర్త ఆదిరెడ్డి వాసు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.


ఇద్దరు తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇద్దరు యువ నేతలు అందులో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. ఈసారి రాజమండ్రి సిటీ వేదికగా అదిరిపోయే పోరు జరిగిందని చెప్పాలి. వాస్తవంగా చూస్తే గత 7 - 8 నెలలుగా సిటీలో కచ్చితంగా తెలుగుదేశం ఘనవిజయం సాధిస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే భరత్ అంచనాల‌కి మించి పుంజుకున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు.. పోలింగ్ స‌ర‌ళి పరిశీలిస్తే సిటీలో భరత్‌ నుంచి వాసుకు గట్టి పోటీ ఎదురయింది. టీడీపీ కచ్చితంగా గెలుస్తుందన్న టాక్ నుంచి టీడీపీ గెలిస్తే చాలు అన్న స్థాయికి పడిపోయింది. తీవ్ర ఉత్కంఠ రేపటి నియోజక వర్గంలో ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో భ‌ర‌త్ అద‌ర గొట్టి ప‌డేశాడు.


ఆదిరెడ్డి వాసు ఏకంగా 55 వేల ఓట్ల భారీ మెజార్టీతో వాసు ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌పై ఘ‌న విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో భార్య గెలిస్తే.. ఈ సారి భార్య మెజార్టీ 32 వేల‌ను క్రాస్ చేసిన వాసు ఏకంగా 55 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించి ఫ‌స్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: