భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు కొడతామన్న ఎన్డీఏ కూటమికి.... అడుగడుగునా షాక్ తగులుతోంది. ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ కూటమిని అసలు... ఓటర్లు ఆదరించలేదని తెలుస్తోంది. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి  దూసుకు వెళ్తోంది. దీనికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.

 ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో  ఎన్డీఏ ప్రభుత్వం రామమందిరాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అలాంటి రామమందిరం నిర్మించిన స్థలంలో కూడా... బిజెపికి ఎదురు దెబ్బ తగులుతుంది. రామ మందిరం ఫైజాబాద్ లోక్సభ పార్లమెంటు నియోజకవర్గం లో ఉంది. అలాంటి లోక్సభ స్థానంలో బిజెపి అభ్యర్థి వెనుకబడ్డాడు. సమాజ్వాది పార్టీ అభ్యర్థి ప్రసాద్  ఫైజాబాద్ నియోజకవర్గంలో దూసుకు వెళ్తున్నాడు.

అక్కడ బిజెపి అభ్యర్థి లల్లు సింగ్ ఓడిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బిజెపి  పార్టీ టెన్షన్ లో ఉంది. హిందువుల కోసం అయోధ్య రామ మందిరం... కట్టినా కూడా... అక్కడ బిజెపి గెలవకపోవడం....  మోడీ ప్రభుత్వాన్ని వేధిస్తోంది. కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి... తమ అభ్యర్థి లీడ్ లోకి.. తమ అభ్యర్థి వస్తాడని బిజెపి నాయకులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా.... ఓవరాల్‌ గా నార్త్ ఇండియాలో ఓటర్లు NDAకు షాక్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో bjp కూటమికి ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ ఇండియాలో (ముఖ్యంగా AP, TGలో) NDAకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో నార్త్ లో nda ఓట్లు ఇండియా కూటమికి, సౌత్ లో ఇండియా కూటమి ఓట్లకు NDAకు మారినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు nda కూటమి 280 స్థానాలకు పైగా లీడింగ్‌ లో ఉంది. అటు కాంగ్రెస్‌ పార్టీ కూటమి 230 స్థానాల్లో లీడింగ్‌ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: