మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు కాగా మొదటి నుండే టి డి పి పార్టీ అభ్యర్థులు అలాగే జనసేన , బిజెపి అభ్యర్థులు ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో టి డి పి , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. వైసిపి ఒంటరిగా పోటీ చేసింది.

ఇక వైసిపి ఒంటరిగా పోటీ చేసిన మేము 151 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ దక్కించుకుంటాము , అధికారంలోకి మళ్ళీ వస్తాము అని జగన్ చెబుతూ వచ్చాడు. ఇక చాలా సర్వేలు కూడా ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గట్టి పోటీ ఉంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చిన పది , ఇరవై సీట్ల తేడాతోనే వస్తారు అని సర్వేలు వచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వస్తున్నాయి. ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలు కావడంతోనే కూటమి అభ్యర్థులు లీడ్ లోకి వెళ్లిపోయారు. ఆ లీడ్ అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కూటమికి సంబంధించిన 159 మంది లీడ్ లో ఉండగా , ఒంటరిగా టిడిపి 132 , జనసేన 20 , బిజెపి 7 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.

ఇక వైసిపి పార్టీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. దీనితో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం కన్ఫామ్ అయిపోయింది. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణస్వీకారం ఏ తేదీన చేయబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చింది. జూన్ 9 వ తేదీన అమరావతి లో చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే టిడిపి నేతలు విడుదల చేశారు. మరి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: