ఇల్లు అలకగానే పండగ కాదు. ఒక్కసారి విజయం సాధించగానే ఇక తిరుగులేదు అనుకోవడం మన అపోహ.  రాజకీయాల్లో రాణించాలంటే ఎంతో ముందు చూపు తో పాటు, భయం కూడా ఉండాలి.  కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా పనికి రాదనేది కొన్ని కొన్ని రాష్ట్రాలలో పార్టీల ఓటమి చూస్తే అర్థం చేసుకోవచ్చు.  ముఖ్యం గా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటు వంటి కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే అధికారాన్ని కోల్పోయారు. అదే బాట లో జగన్ కూడా నడిచారని చెప్పవచ్చు. తాను తప్పక గెలుస్తానని, చిన్నా చితక సర్వే సంస్థల ను నమ్మి పప్పు లో కాలేశారు.

 చంద్రబాబు సైలెంట్ గా ఉండడం చూసి నాకు భయపడుతున్నారు కావచ్చు అనుకున్నారు. కానీ చంద్రబాబు సైలెంట్ గా ఉండి పంజా విసిరారు. ఏనుగు కుంబస్థలాన్ని బద్దలు కొట్టారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటు వంటి చంద్రబాబు ను కొట్టాలంటే అంత ఈజీ గా కాదనేది జగన్ కు మరోసారి  చూపించారని చెప్పవచ్చు. ఒక్క దెబ్బ కు పాతాళానికి పడిపోయారు జగన్.  ఇక రాబోవు ఐదు సంవత్సరాలు జగన్ మంచి కోచింగ్ సెంటర్ లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే కానీ, మరోసారి చంద్రబాబు ను ఢీ కొట్టలేడు.

ఆయన రాజకీయాల్లో నిలబడాలి అంటే ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటే తప్ప  మరోసారి రాజకీయాల్లో పోటీ చేయడానికి రావడం కష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మరి చూడాలి జగన్ ఏ సంస్థలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు అనేది ముందు ముందు తెలుస్తుంది. మరి చూడాలి ఈసారి చంద్రబాబు జగను కు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడతారు, ఎన్ని నెలలు జైలుకు పంపిస్తారు, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అసలు వైసీపీ పార్టీ అనేది లేకుండా చేస్తారా అనేది చంద్రబాబు పరిపాలన చేస్తుంటే మనకు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: