మే 13 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీ 2019 వ సంవత్సరం ఎలక్షన్లలోకి దిగింది. కానీ ఆ ఎలక్షన్లలో జనసేన పార్టీకి ఘోరమైన దెబ్బ తగిలింది. పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండింటిలో ఓడిపోయాడు. ఇక ఈ పార్టీ నుండి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాడు. ఇంతటి స్థాయిలో దెబ్బ తగిలిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పట్లో కోలుకుంటాడా అని జనాలు అంతా భావించారు.

కానీ 2024 వ సంవత్సరానికి జనసేన సీన్ మొత్తం రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ సారి ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా మొదటగా టిడిపి , బీజేపీ లతో పాటు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాడు. అందులో భాగంగా భారీ స్థాయి అసెంబ్లీ , ఎంపీ స్థానాలను తీసుకోకుండా కేవలం 21 అసెంబ్లీ స్థానాలను ,  2 ఎంపీ స్థానాలను మాత్రమే తీసుకున్నాడు. వాటిపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఖచ్చితంగా వాటన్నింటినీ గెలవాలి అనే విధంగా ప్రణాళికలను వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో పవన్ 100% సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే వస్తున్న ఫలితాలు అదే విధంగా ఉన్నాయి. ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అయింది.

అందులో భాగంగా మొదటి నుండే జనసేన పోటీ చేస్తున్న దాదాపు చాలా ప్రాంతాలలో లీడ్ లోకి వచ్చింది. ఇకపోతే చాలా సమయం నుండి జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే 20 స్థానాలలో లీడ్ లో కొనసాగింది. అలాగే రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తే రెండింటిలో కూడా లీడ్ లో ఉంది. ఇక ఇంతసేపు పాలకొండలో జనసేన అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఇక ఆయన కూడా ప్రస్తుతం ఆదిత్యం లోకి వచ్చారు. దీనితో జనసేన అభ్యర్థుల పోటీ చేసిన 21 స్థానాలలో 21 స్థానాలలో లీడ్ లో ఉన్నారు. రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే రెండిట్లో కూడా లీడ్ లో ఉన్నారు. ఇలా జనసేన అద్భుతమైన దూకుడుగా ముందుకు సాగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: