ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సర్వే అనేది చాలా వేగంగా మార్పులు చెందుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయిలో  151 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించిన వైసిపి తన పాలనను కొనసాగిస్తూ వచ్చింది.  వారు ప్రజలకు అందించిన పథకాలే మళ్లీ గెలిపిస్తాయని జగన్ గట్టిగా నమ్మారు. కానీ ఏపీ ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టారు. కనీసం కోలుకోకుండా దెబ్బ కొట్టారు. అక్కడి ప్రజలు కొట్టిన దెబ్బకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి దక్కే పరిస్థితి లేదు.  అలాంటి ఈ తరుణంలో  ఆంధ్రప్రదేశ్లో తాను గెలవనని ముందే గ్రహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు జగన్ ను ఓడించడం కోసం జనసేన,బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారు. 

 అయినా ఆయన తన గెలుపుపై ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేయకుండా ప్రచారంలో దూసుకుపోయారు.  దాదాపు ఎలక్షన్స్ కు ఆరు నెలల ముందు మరోసారి జగనే పూర్తిస్థాయి అధికారంలోకి వస్తారనే ప్రచారం సాగింది. నెలలు గడిచే కొద్దీ జగన్ కాస్త వెనుకబడి పోయారు. చివరికి ఇద్దరికీ హోరాహోరీ పోటీ ఉంటుందని అనుకున్నారు.  ఎవరికి వచ్చినా 85 సీట్లకు దాటవని భావించారు.  కానీ ఆ రిజల్ట్ అంతా తలకిందులైంది.మొత్తం 175 నియోజకవర్గాల్లో 161 నియోజకవర్గాల్లో టిడిపి కూటమి గెలుపు దిశ గా దూసుకెళ్తున్నారు. ఇందులో టిడిపి అభ్యర్థులు 133 స్థానాల్లో దూసుకుపోగా జనసేన 20 స్థానాల్లో బిజెపి ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.

 చంద్రబాబు ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆయన ఎఫెక్ట్ 175 నియోజకవర్గాల్లో తప్పనిసరిగా కనిపించింది. 2019లో ఒంటరిగా పోటి చేసిన జనసేన టిడిపి ఓట్లను చీల్చేసింది. దీంతో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు.  జనసేన బలాన్ని పసిగట్టిన చంద్రబాబు ఆయనతో జట్టు కడితే తప్పక గెలుస్తామనే ఆలోచన చేసి పవన్ ను తన చెంతన చేర్చుకున్నాడు. విజయంలో పూర్తిస్థాయి భాగస్వామిని చేశారు.  ఈ విజయం తప్పకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని చాలామంది ప్రజలనుకుంటున్నారు.  అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చిన తప్పు లేదని భావిస్తున్నారు.  మరి చూడాలి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి పదవి దక్కుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: