ఏపీలో ఎన్నికల వేడిని ప్రత్యక్షంగా రుచి చూపించిన నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ స్థానం. గత ఎన్నికల్లో వైసిపి తరుపున గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టిడిపి తరుపున పోటీలో ఉన్నారు. ఆయన్ను తొలుత గుంటూరు నుండి పోటీ చేయాలని వైసిపి అధిష్టానం ఆదేశించగా అందుకు అయన నిరాకరించి నరసరావుపేటపైన పట్టుబట్టారు. అయితే వైసిపి అందుకు అంగీకరించకపోవడంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరగా ఆయనకు టిక్కెట్‌ను టిడిపి ఖరారు చేసింది. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వైసీపీ నుంచి బరిలోకి దిగారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అధిష్టానం సూచనతో నరసరావుపేటకు షిఫ్ట్ అయ్యారు. మరి ఈ ఇద్దరు యువనేతల్లో జనాల మనసు గెలుచుకునేది ఎవరు ఎన్నికల బరిలో విజయం సాధించేది ఎవరు అని ఆసక్తికర చర్చ అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఆ చర్చకు తెరదించే సమయం వచ్చింది.


 ప్రస్తుతం జరిగిన అభివృద్దికి తోడు మరింత ముందుకు తీసుకెళ్తానని సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు జనాల్లోకి వెళ్లారు. అసలు నరసరావుపేట పార్లమెంట్‌లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని వైసీపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముగిసింది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో మొత్తం 17లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి 85.69 పోలింగ్ శాతం నమోదయింది. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే పెదకూరపాడు, వినుకొండలో అత్యధికంగా 89శాతం శాతం ఓట్లు పోలయ్యాయ్. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా 80శాతానికి తగ్గనే లేదు. ఆ స్థాయిలో పల్నాడు ప్రాంత ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లకు పోటెత్తారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం టిడిపి అభ్యర్థి లావు కృష్ణదేవయరాలు వైసిపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ 86353 ఓట్ల ఆదిక్యంతో ముందంజలో ఉన్నారు.దాంతో పల్నాటి ప్రజలు పార్టీ ముఖ్యం కాదని మాకు అభ్యర్థి ముఖ్యమని ఓటు రూపంలో చెప్పకనే చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: