ఈరోజు వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. వై నాట్‌ 175 అనే నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లిన ఆయన కనీసం 75 కాదు కదా 20 సీట్లను కూడా గెలుచుకోలేకపోయారు. టీడీపీ కూటమి 150 కి పైగా సీట్ల లీడింగ్ తో పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు ముందు చాలామంది జగన్ కచ్చితంగా గెలవబోతున్నారని నమ్మారు మెజారిటీ తగ్గుతుంది కానీ ఆయన విజయం సాధించడం మాత్రం ఖాయమని చాలామంది అనుకున్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా జగన్ జాతకాన్ని విశ్లేషించి ఈసారి మళ్లీ ఆయన గెలవబోతున్నారు అని అంచనా వేశారు. పవన్ కళ్యాణ్ జాతకంలో రాజయోగం లేదని ఆయన ఓడిపోవడం ఖాయమని ఒక జోష్యం చెప్పారు.

అయితే ఆయన వేసిన ఈ రెండు అంచనాలు కూడా తప్పయ్యాయి. వేణు స్వామి చెప్పినట్టు జగన్ గెలవలేదు. ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోతారని చెప్పారు కానీ పవన్ మాత్రం కొన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. ఇంత దారుణంగా ఆయన అంచనాలు తప్పు కావడంతో చాలామంది ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ జగన్ జాతకం విశ్లేషించడంలో తాను ఫెయిల్ అయ్యానని తన అంచనా తప్ప అయిందని అంగీకరించారు. " జగన్ గెలుపుపై నా అంచనా ఫెయిల్ కావడం వల్ల నేను ఇకపై సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎక్కడా కూడా ఎవరి వ్యక్తిగత జాతకాలను విశ్లేషించను, ప్రీడీక్షన్స్ చెప్పను" అని తాజాగా వేణు స్వామి స్పష్టం చేశారు.

ఇకపై సినీ సెలబ్రిటీల, పొలిటిషన్ల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పను అని వేణు స్వామి చేసిన ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి తాను చెప్పిందే జరగబోతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పే వేణు స్వామి జగన్ ఓటమి దెబ్బకు జాతకాలు చెప్పుకోవడం మానేయాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: