దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి సీటును రఘురామ కృష్ణంరాజుకు కేటాయించారు. మంతెన రామరాజుకు సర్ది చెప్పి ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశారు. ఉండిలో ముక్కోణపు పోటీ జరుగుతుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. ముగ్గురు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం విశేషం.
నియోజకవర్గంలో ఉండి ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాలు విస్తరించి ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు తెలుగుదేశం పార్టీలో జరిగిన ట్విస్టులు నేపథ్యంలో ముక్కోణపు పోటీ ఉంటుందని అందరూ అనుకున్నా... టీడీపీ రెబల్‌గా పోటీ చేసిన.. మాజీ ఎమ్మెల్యే శివ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయారన్న ప్రచారం గట్టిగా నడిచింది. దీనికి తోడు నియోజకవర్గంలో క్షత్రియ వర్గంతో పాటు ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపువర్గం ఓటర్లు సైతం కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారని.. త్రిబుల్ ఆర్ బయటపడతారని ఎక్కువ సర్వేలు స్పష్టం చేశాయి.
ఈ రోజు జరిగిన కౌంటింగ్‌లో రఘురామ ఏకంగా 56,700 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి.. సెన్షేషనల్ రికార్డు క్రియేట్ చేసి మరీ సగర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏదేమైనా ఈ సారి అసెంబ్లీలో స్పీకర్ పదవి లో రఘురామ సత్తా చూపిస్తాడని.. జగన్‌ను ఆటాడుకుంటారని అంటున్నారు.