ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం కొత్త జిల్లాల విభజనలో భాగంగా బాపట్ల జిల్లా కిందికి వెళ్ళింది.  ఈ క్రమంలో బాపట్ల నియోజకవర్గంలో ప్రతిసారి చాలా ఆసక్తికరమైన ఎన్నికల పోరు జరుగుతుంది. అలాంటి ఈ నియోజకవర్గంలో  పరిధిలో బాపట్ల, పిట్టల వాని పాలెం, కర్లపాలెం  మండలాలు ఉన్నాయి. కులాలపరంగా చూస్తే మాలా, రెడ్డి, కాపులు ఎక్కువ. ముస్లిం, యాదవ, కమ్మ, క్షత్రియ ఓటర్లు కూడా మోస్తారుగా ఉన్నారు. గత రెండు దశాబ్దాల నుంచి బాపట్లలో టిడిపి పట్టు కోసం ఎదురుచూస్తోంది. 1999లో టిడిపి తరఫున మంతెన అనంత వర్మ  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో  టిడిపి ఓటమి పాలవుతూనే ఉంది. ఇప్పటికీ అక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏడుసార్లు, టిడిపి నాలుగు సార్లు, వైసిపి రెండుసార్లు గెలిచింది. కమ్యూనిస్టులు ఒకసారి, ఇండిపెండెంట్ లు ఒకసారి గెలిశారు. బాపట్ల నియోజకవర్గంలో ఈసారి చాలా ఆసక్తికరమైనటువంటి పోరు ఏర్పడింది. అయితే ఈసారి వైసీపీ నుంచి కోన రఘుపతి బరిలో ఉన్నారు. కోన  ఫ్యామిలీ ఈ నియోజకవర్గంలో చాలా ఫేమస్. ఈసారి టిడిపి తరఫున నరేంద్ర వర్మ పోటీ చేస్తున్నారు. ఈసారి నరేంద్ర వర్మ విజయం సాధిస్తారా లేదంటే రఘుపతి హైట్రిక్ కొడతారా అనేది చాలా కీలకంగా మారింది.

 మరి చూడాలి బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటేశారు.  ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది అనేది చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి వేగేసన నరేంద్ర వర్మ రాజు  88,827 ఓట్లు సాధించారు. ఈయనకు ప్రత్యర్థిగా వచ్చినటువంటి కోన రఘుపతి 62027 ఓట్లు సాధించారు. దీంతో నరేంద్ర వర్మ రాజు 26,800 ఓట్ల మెజారిటీతో  ఘనవిజయం సాధించారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజలందరి విజయమని, వైసీపీ అవినీతి పాలనకు ప్రజలే బుద్ధి చెప్పారని  ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: