ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఆసక్తి రేపిన నియోజకవర్గం విజయవాడ ఈస్ట్ సీట్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలలో వెరీ వెరీ హాట్ సీట్‌.. విజయవాడ వెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత.. వరుసగా రెండుసార్లు గెలిచిన గద్దె రామ్మోహన్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి 2019 ఎన్నికలలో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయవాడ యువ నేత.. దేవినేని కుటుంబ వారసుడు దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేస్తుండడంతో.. అటు టీడీపీ సీనియర్ గద్దె రామ్మోహన్ రంగంలో ఉండడంతో విజయవాడ తూర్పు ఈసారి ఎవరివశం ? అవుతుంది అన్నది చాలా ఉత్కంఠ రేపుతుంది.


అటు చూస్తే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. ఇటు చూస్తే వైసీపీలో యువనేత.. అందులోను అవినాష్ 2014లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ... 2019లో గుడివాడలో టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయాయి.. ఈసారి అవినాష్‌కు గెలుపు చావో.. రేవో అయింది. తన రాజకీయ భవిష్యత్తుతో పాటు దేవినేని కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సి వచ్చింది. అందుకే గత రెండు సంవత్సరాలుగా అవినాష్ తూర్పు నియోజకవర్గంలో విపరీతంగా కష్టపడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి నియోజకవర్గంలో గట్టిపట్టు సాధిస్తూ ప్రచారం చేశారు. ఇక గత రెండు ఎన్నికల్లోను గద్దెకు పెద్దగా తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ ఎదురుకాలేదు. అయితే ఈసారి అవినాష్ మాత్రం గద్దెకు చెమటలు పట్టించాడు అని చెప్పాలి.


ఏపీలోనే చాలా ఉత్కంఠ రేపిన విజ‌య‌వాడ తూర్పు లో చివ‌ర‌కు ఎవ్వ‌రూ కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో 48 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అస‌లు ఈ విజ‌యాన్ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇక దేవినేని వార‌సుడు వ‌రుస‌గా మూడో సారి ఓడిపోవ‌డంతో చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల‌న్న ఆయ‌న ఆశ‌లు ఆవిరయ్యాయి. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ తూర్పు నుంచి గ‌ద్దే రామ్మోహ‌న్ హ్యాట్రిక్ విజ‌యం సాధించిన‌ట్ల‌య్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: