[3:51 PM, 6/4/2024] Hubby: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఈ రోజున విడుదలయ్యాయి. అయితే ఇవి చాలా సంచలనంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటుతో విలక్షణమైన తీర్పునిచ్చారని చెప్పవచ్చు.. 2019 ఎన్నికలలో వైసిపి ప్రభంజనం ఇచ్చిన ఓటర్లు ఇప్పుడు అదే విధమైన తీర్పును కూడా టిడిపి పార్టీకి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా టిడిపి బిజెపి జనసేన పార్టీ మూకుమ్మడిగా పోటీ చేశాయి. ఊహించని రీతుల ప్రజలు తీర్పు ఇవ్వడంతో వైసిపి పార్టీ ఒక్కసారిగా కుదేలు అయింది. అయితే వైసిపి జగన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే అంటూ కొన్ని వైరల్ గా మారుతున్నాయి.


ఐదేళ్ల గత ప్రభుత్వంలో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండడం ఎక్కడా చూడలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితం రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రాజధాని అంశం చాలా దెబ్బతీసేలా చేసిందని కూడా దెబ్బతీసేలా కనిపించింది దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు రాజధానులను ప్రతిపాదన తీసుకురావడం చాలా దెబ్బతీసినట్లు తెలుస్తోంది. అమరావతి కాదని విశాఖపట్నంకి పరిపాలన మారుస్తానని చెప్పడంతో చాలామంది నచ్చలేదని సమాచారం.


ఐదేళ్ల పరిపాలనలో జగన్ కేవలం బటన్ మాత్రమే నొక్కాడని వివిధ వర్గాల ప్రజలకు డబ్బు పంచడం తో పరిపాలన చేశారని.. ఈ కార్యక్రమం వల్ల చాలా దెబ్బతినిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే తన పరిపాలన కాలంలో జగన్ అభివృద్ధిని మరిచిపోయారని..ఒక పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని వ్యతిరేకత ఉన్నది.

అధికారంలోకి వచ్చిన జగన్ మౌలిక అవసరాలను పట్టించుకోలేదని ముఖ్యంగా రోడ్ల పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా జరిగింది.


నవరత్నాల పేరిట అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరహాలో హామీలను నెరవేర్చలేకపోయారని ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో చాలా వ్యతిరేకత మొదలయిందని అందుకే కూటమికి ఓటు వేశారని తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చిన జగన్ కక్ష రాజకీయాలు చేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని టిడిపి నేతలు తీవ్రమైన స్థాయికి తీసుకు వెళ్లడమే కాకుండా చంద్రబాబును జైలుకు వెళ్లడం కూడా ఉపయోగించుకున్నారు.


చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కూటమి విపరీతంగా ప్రచారం చేసి వీటిని అస్త్రంగా ఉపయోగించుకుంది ఇది గట్టి దెబ్బ పడినట్లుగా తెలుస్తోంది.
[3:51 PM, 6/4/2024] divya Reddy: ఏపీ:

మరింత సమాచారం తెలుసుకోండి: