కడప జిల్లాలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఈసారి ఇక్కడి నుంచి వైసీపీ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి, టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) పోటీపడ్డారు. అయితే ఎప్పటిలాగానే ఇక్కడి నుంచి వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించారు.

* 59 వేల మెజార్టీతో జ‌గ‌న్ గెలుపు

మొత్తం 22 రౌండ్లు ముగిసేసరికి జగన్‌కు 1,05,424 ఓట్లు వచ్చాయి, ఆయన సమీప అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)కి 48,424 ఓట్లు వచ్చాయి. అంటే 59 వేల ఓట్ల మెజార్టీతో సీఎం జగన్ మరోసారి పులివెందుల నుంచి చేశారు.

ఇక మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చిన్నాన్న హత్యకు గురికావడంతో రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ ఎమ్మెల్సీ, కడప జిల్లా సీనియర్ నేత అయిన రవీంద్ర 2011 ఉప ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. బీకాం చదువుకున్న జగన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణించాక సొంతంగా వైసీపీ పార్టీని ప్రారంభించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 227,856.

పులివెందులలో 1955 నుంచి జరిగిన ఎన్నికల్లో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గ నేతలు మాత్రమే నిల్చున్నారు. ఇప్పటిదాకా వేరే కులానికి చెందిన ఎవరూ కూడా ఇక్కడ పోటీ చేయలేదంటే అతిశయోక్తి కాదు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నుంచి ఇలా ఏ ప్రధాన పార్టీయేనా ఇక్కడ రెడ్లనే మాత్రమే నిలబెడుతుంది. పులివెందులలో 1978 కాలం నుంచి ఓన్లీ వైఎస్ కుటుంబానికి చెందిన నేతలు మాత్రమే ఇక్కడ నిలబడుతూ వస్తున్నారు. వారు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. జగన్‌ మోహన్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో ఎక్కడి నుంచి 75,243, 90,110 మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. ఈసారి కూడా ఇక్కడి నుంచి గెలిచేశారు. దాంతో హ్యాట్రిక్ హిట్టు కొట్టినట్లు అయింది. పులివెందులతోపాటు సింహాద్రిపురం, లింగాల, వేముల, తొండూరు, వేంపల్లె, చక్రాయపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: