ముఖ్యంగా ఇక్కడ సునీల్ కుమార్ కి టికెట్ ఇస్తామని కూటమి అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ సునీల్ కి బదులు ఎంఎస్ రాజుకి టికెట్ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళనలు మొదలయ్యాయి.. ముఖ్యంగా క్యాడర్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మడకశిర టిడిపి కార్యాలయాన్ని ముట్టడించారు.. టిడిపి జెండాలను చింపి పోస్టర్లను చెప్పులతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబుకు నీతి లేదు అంటూ ధర్నాలు కూడా చేశారు. ఇక అలా ఒకరకంగా ఎంఎస్ రాజుకి ఇక్కడ టిడిపి క్యాడర్ నుంచి వ్యతిరేకత ఏర్పడింది.. అప్పటివరకు టికెట్టు ఆశించిన సునీల్ పూర్తిస్థాయిలో టికెట్ లభించకపోవడంతో భంగపడ్డారు. ఇక అలా ఒకవైపు క్యాడర్ వల్ల ఎమ్మెస్ రాజుకు వ్యతిరేకత ఏర్పడడంతో మరొకవైపు ఈర లక్కప్పకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అటు ప్రజలలో ఇటు కేడర్ అభ్యర్థులలో అసమ్మతి నెలకొన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ మొదలైంది..
ఇక తాజాగా విడుదలైన ఫలితాలను బట్టి చూస్తే... కేవలం 25 ఓట్లతోనే ఈరలక్కప్పా ఎమ్మెస్ రాజు గెలుపొందారు..