భారతదేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఇవాళ ఉదయం నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మొదటి నుంచి 400 ఎంపీలు గెలుస్తామని బిజెపి కూటమి చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇవాళ... ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చేలా.. ఫలితాలు వచ్చాయి. 400 కాదు కదా... 300 సీట్లు కూడా ఎన్డీఏ కూటమి దాటేలాకనిపించడం లేదు.

 ఇప్పటివరకు ఉన్న ట్రెండు ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 294 ఎంపి స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఈ 294 స్థానాలలో...  ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఇక అటు 230 స్థానాలలో... కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.  ఎగ్జిట్ పోల్స్ అలాగే సర్వే సంస్థలు చెప్పిన ఫలితాల కంటే చాలా భిన్నంగా.... ఇండియా కూటమి దూసుకు వెళ్తోంది.

 పది సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి ఇంతలా పవర్ ఫుల్ గా వచ్చింది. అయితే... మ్యాజిక్ ఫిగర్ దాటడంతో... మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే గతంలో కంటే... దూకుడుగా బిజెపి పార్టీ ఉండబోదు. ఎందుకంటే ఎంపీ సీట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో... ఎలాంటి ఆటలు ఆడిన... ప్రభుత్వానికే ప్రమాదం ఉంటుంది. అయితే ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో... కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నారని... రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలలో.. 16 స్థానాల వరకు టిడిపి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 16 ఎంపీ స్థానాలు కచ్చితంగా మోడీకి అవసరం అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి... నిధులు, ప్రత్యేక హోదాపై గట్టిగా అడిగే ఛాన్స్ చంద్రబాబుకు ఉంటుంది. ఒకవేళ తమ డిమాండ్లకు బిజెపి ఒప్పుకోకపోతే... ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తామని చంద్రబాబు బెదిరించే ఛాన్స్ కూడా ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం  చంద్రబాబు అలా చేయడం మంచిపనే. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి.. ఈ ఎన్నికల తర్వాత.. కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: