ఏపీలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించారు. ఈసారి వైసీపీ నుంచి పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, టీడీపీ నుంచి పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పోటీపడ్డారు. మొత్తం ఓటర్ల సంఖ్య 200,452. ఇక్కడ 1952 నుంచి టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. తాజాగా గెలవడంతో టీడీపీ మూడోసారి గెలిచినట్లు అయ్యింది.

- 2024 ఎన్నికల రిజల్ట్

టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణచైతన్య రెడ్డి 95,207 ఓట్లు సాధించారు. పి. రవీంద్రనాథ్‌ రెడ్డి 69,850 ఓట్లతో బాగా వెనుకబడ్డారు. కృష్ణచైతన్య రెడ్డి 25,357 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. కమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఇటీవల కాలంలో ఇంతటి మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. ఈ విజయంతో టీడీపీ కమలాపురంలో ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు. ఒక కమలాపురంలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుని, ఎక్కువ ఓటు షేర్ సంపాదించి చరిత్ర క్రియేట్ చేసింది. ప్రభుత్వంపై క్రియేట్ అయిన వ్యతిరేకత వల్ల జనసేన కూడా కలలో ఊహించని విధంగా 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల కూడా గెలిచింది.

రవీంద్రనాథ్‌ రెడ్డి 2019లో టీడీపీ నేత పి.నరసింహారెడ్డిపై 27,333 ఓట్ల తేడాతో, 2014 అదే నేతపై 5,345 కోట్ల తేడాతో గెలుపొందారు. కానీ ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. టిడిపి సునామీ ముందు ఆయన తట్టుకోలేకపోయారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల వైసీపీ సీనియర్ నేతలు చాలా చోట్ల ఓడిపోయారు. డాక్టర్ దాసరి సుధా లాంటి వారు తప్ప  మిగతా అందరూ ఓటమి చవి చూశారు. కమలాపురం, చింతకొమ్మదిన్నె, చెన్నూరు, పెండ్లిమర్రి,వల్లూరు, వీరపునాయునిపల్లె మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈసారి ఈ మండలాలలోని ప్రజలందరూ టీడీపీకే మొగ్గు చూపినట్లు స్పష్టం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: