నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. రాళ్ల దాడులు, హాహాకారాలు.. ఏకంగా అభ్యర్థుల మీద దాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.సంక్షేమ కార్యక్రమాలకు తోడు, అభివృద్ధిని వైసీపీ జనాల ముందు పెట్టింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి తాను నిత్యం జనాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నానని జరిగిన అభివృద్ధిలో అగ్రభాగం తనదేనని చెప్పుకున్నారు.కానీ చివరికి పలనాడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టినట్టుగా లావుని గెలిపించుకున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు పరిధిలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే రాజకీయం గత్తర లేచింది. టీడీపీ ఫుల్ స్వింగ్‌లో వార్ వన్‌సైడ్ అంటూ దూసుకుపోతుంది. 18 రౌండ్లు ముగిసేసరికి 31412 ఓట్లు తో అధిక్యతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి ప్రతిపాటిపుల్లారావు .
 
పల్నాడు జిల్లా వినుకొండలో టిడిపి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య రాజకీయ పోరు ఒక యుద్ధంలా జరిగింది.2024 ఎన్నికలు సత్తెనపల్లి  నియోజకవర్గానికి ఛాలెంజ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ నియోజవర్గంలో హేమాహేమీలు పోటీ పడ్డారు. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు  పోటీ చేయగా తెలుగుదేశం నుంచి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ  బరిలో ఉన్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావటం విశేషం.సత్తెనపల్లి లో కూడా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు పై భారీ ఆదిక్యతతో కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు.పెదకూరపాడు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ మామ అల్లుళ్ళ మధ్య రాజకీయ యుద్ధం అనేది రసవత్రంగా సాగింది.మామ పై అల్లుడు భారీ మెజారిటీతో గెలుపొందారు.పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన దాడుల తర్వాత మన రాజకీయం ఇంకా వేడెక్కింది. టిడిపి ఆవిర్భావం నాటి నుండి నరసరావుపేట అసెంబ్లీ సీటు టిడిపికి కంచుకోటగా మారింది.అలాంటి చోట వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గట్టి పోటీని ఇచ్చారు. చివరికి టిడిపి అభ్యర్థి అరవింద బాబు ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నారు.

పలనాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెల్సిందే. వైసీపీ నుండి అధికార సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోటీ చేయాగా టిడిపి నుండి జూలకంటి బ్రహ్మారెడ్డి బరిలో ఉన్నారు.బ్రహ్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై భారీ మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నారు.గురజాల నియోజకవర్గం విషయానికి వస్తే టిడిపి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు వైసిపి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కూడాకౌంటింగ్  ప్రారంభం దగ్గర నుంచి ఎరపతినేని మంచి స్పీడ్ మీద దూసుకుపోతున్నారు. చివరికి ఈ నియోజకవర్గం చుట్టేసి తన ఖాతాలో వేసుకుంది.ఈ విధంగా పల్నాడు మొత్తాన్ని రౌండప్ చేసి సైకిల్ చుట్టేసింది అనడంలో ఆశ్చర్యంలేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: